ETV Bharat / state

'రైతులు నిశ్చింతగా విత్తనాలు కొనుగోలు చేసుకోండి'

అక్షయ తృతీయ సందర్భంగా విత్తనాల కొనుగోళ్లకు రైతులకు వెసులుబాటు కల్పిస్తూ... దుకాణాలు తెరిచేందుకు ప్రభుత్వం షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. విత్తనాలు అధిక ధరలకు విక్రయించకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది.

author img

By

Published : Apr 25, 2020, 6:05 PM IST

officials-gives-permission-to-open-agri-shops
'రైతులు నిశ్చింతగా విత్తనాలు కొనుగోలు చేసుకోండి'

కరోనా నివారణలో భాగంగా చేపట్టిన కట్టుదిట్టమైన ఏర్పాట్ల నుంచి అధికారయంత్రాంగం... రైతులకు కాస్త వెసులుబాటు కల్పించింది. ఆదివారం అక్షయతృతీయ సందర్భంగా రైతులు విత్తనాలు కొనుగోళ్లు చేసుకునేలా... దుకాణాలను తెరిచేందుకు షరతులతో కూడిన అనుమతినిచ్చింది. దీనిపై డీలర్లు ఏమంటున్నారంటే....

ప్ర. విత్తన దుకాణాలు ఇప్పడిప్పుడే ప్రారంభమవుతున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం ఇచ్చిన సూచనలేంటి?

జ. అక్షయతృతీయకు రైతులు విత్తనాలు తీసుకెళ్లేందుకు చూస్తారు. అందుకే అధికారులు రైతులకు వెసులుబాటు కల్పించారు. స్టాక్స్ కూడా ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. ఏ విత్తనం కూడా కొరత ఉండదు. ఎమ్మార్పీ ధర కంటే ఎక్కువ ధరకు అమ్మకుండా చర్యలు తీసుకున్నామని దుకాణాల డీలర్స్ తెలిపారు. గతంలో మహారాష్ట్ర నుంచి రైతులు వచ్చి విత్తనాలు తీసుకెళ్లేవారని... ప్రస్తుతమున్న పరిస్థితుల్లో వాళ్లు రారు కాబట్టి రైతులు నిశ్చింతగా ఉండొచ్చని తెలిపారు.

ప్ర. దుకాణాలు తెరిచేందుకు ప్రభుత్వం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు సమయమిచ్చింది?

జ. ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు తెరవాలని అధికారులు సూచించారు. రైతులు కూడా వస్తున్నారు కాబట్టి... ఈ సమయాల్లో కొంచెం వెసులుబాటు కల్పించాలి.

ప్ర. రైతులే దుకాణాలకు వస్తారా? మీరే వెళ్లి పంపిణీ చేస్తారా?

జ. కంటైన్​మెంట్ లేని ప్రాంతాల్లో వెళ్లి విత్తనాలు పంపిణీ చేయమని అధికారులు ఆదేశించారు. అది సాధ్యమయ్యే పని కాదు. మార్కెట్​కి వచ్చి రైతులు కొంటేనే బాగుంటుంది.

ప్ర. దుకాణాల వద్ద ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు?

జ. దుకాణాల వద్ద అన్ని ఏర్పాట్లు చేశాము. శానిటైజర్లు సైతం ఏర్పాటు చేశాము. కానీ రైతుల్లో ఎంత అవగాహన కల్పించినా... డబ్బుల విషయంలో వారు ఏటీఎం కార్డులు వాడట్లేదు.

ప్ర. విత్తనాలు ఎక్కడనుంచి వస్తున్నాయి?

జ. తమిళనాడు నుంచి వస్తున్నాయి. ఇంతకుముందు తమిళనాడు నుంచి నిర్మల్ వచ్చేవి. కానీ ఇప్పుడు నిర్మల్​లో రెడ్​జోన్​లో ఉండటం వల్ల... నేరుగా ఆదిలాబాద్​లోని గోదాంకు విత్తనాలు తీసుకొస్తున్నారు.

ఇవీ చూడండి: లాక్​డౌన్ ఫ్రస్ట్రేషన్​ను బయటపెడితే క్యాష్​బ్యాక్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.