రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షం కురుస్తోండగా.. ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం సాధారణ వర్షపాతం కురిసింది. జిల్లాలోని 18 మండలాలకుగానూ ఆరుమండలాల్లో లోటు వర్షపాతం నమోదైంది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటిదాకా 6.80 సెంమీల వర్షం కురవాల్సి ఉండగా 5.67 సెంమీల వర్షం కురిసినట్టు అధికారులు తెలిపారు.
గడిచిన 24 గంటల నుంచి ముసురు పడుతున్నప్పటికీ 1.33 సెంమీల వర్షపాతం కురవాల్సి ఉండగా 2.24.సెంమీల వర్షం కురిసింది. భీంపూర్, జైనాథ్, గాదిగూడ, గుడిహత్నూర్, ఆదిలాబాద్ గ్రామీణం, సిరికొండ మండలాల్లో తక్కువ వర్షం కురిసింది.
ఇదీ చూడండి : పొంగిపోర్లుతోన్న లక్నవరం చెరువు, జంపన్న వాగు