ETV Bharat / state

బకాయిలు కూడా వస్తాయనుకుంటే... అసలు జీతాలకే దిక్కులేకపాయే...! - adhilabad latest news

ఒకటో తారీఖున ఠంచనుగా వేతనాలు అందుకునే ఉద్యోగ, పింఛనుదారులకు ఈసారి నిరీక్షణ తప్పడం లేదు. వారం రోజులు దాటినా బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమకాకపోవటం వల్ల అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 38 వేల మంది వేతనాలు రాక ఇక్కట్లు పడుతుండగా.. రూ.135 కోట్ల మేర వారికి ప్రభుత్వం వేతనాలు, పింఛన్ల రూపేన చెల్లించాల్సి ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

no salaries to government employees in adilabad district

author img

By

Published : Oct 8, 2020, 10:42 PM IST

ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో పనిచేసే ఉద్యోగులు, ఉపాధ్యాయులతో పాటు పదవి విరమణ పొందిన పింఛనుదారులకు ప్రతినెల ఒకటో తారీఖునే తమ బ్యాంకు ఖాతాల్లో వేతనాలు, పింఛను డబ్బులు జమ అవుతుంటాయి. ఈ నెలలో మాత్రం భిన్నమైన పరిస్థితి నెలకొంది. ఒకటి, రెండు కాదు కదా.. 8వ తారీఖు వచ్చినా వారి ఖాతాల్లో వేతనం, పింఛను జమకాలేదు. దీనికి తోడు కరోనా సమయంలో 3 నెలల పాటు వేతనంలో కోత విధించిన డబ్బులు చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు బతుకమ్మ, దసరా పండగలు ఉండటం వల్ల బకాయిలతో పాటు నెలవారీ వేతనం వస్తుందని అంతా సంబురపడుతుండగా.. ఆ సంతోషం అప్పుడే మాయమైంది.

బిల్లులు ఆమోదం పొందినా....

వేతనాల కోసం అటు కార్యాలయాలు, ఇటు బ్యాంకుల చుట్టు తిరుగుతున్నా... ఫలితం లేకుండా పోతోంది. ట్రెజరీ కార్యాలయాలకు వెళ్తే బిల్లులు ఆమోదం పొందినట్లు చూపుతున్నా.. డబ్బులు ఇంకా ఖాతాల్లో జమ కావాల్సి ఉందని అంతర్జాలంలో కనిపిస్తోంది. ఈ తరుణంలో కోత విధించిన వేతన బకాయిల మాట దేవుడెరుగు... నెలవారీ వేతనం కూడా రాకపోవటం వల్ల నానా అవస్థలు పడుతున్నట్లు పింఛనుదారులు, ఉద్యోగ, ఉపాధ్యాయులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వ తీరుపైనా అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ప్రతి నెల రూ.135 కోట్లు...

ఉమ్మడి జిల్లాలోని ఆదిలాబాద్‌, నిర్మల్‌, మంచిర్యాల, కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాల పరిధిలో 20వేల మంది ఉద్యోగులు, 18వేల మంది పింఛనుదారులు ఉన్నారు. వీరికి ప్రతి నెల రూ.135 కోట్ల వేతనాలు, పింఛన్ల రూపేనా ప్రభుత్వం ఖజానా శాఖ ద్వారా చెల్లిస్తూ వస్తోంది. ఈ-కుబేర్‌ విధానం అమల్లోకి వచ్చాక ప్రభుత్వ ఆదాయ వ్యయాలను బట్టి ఆర్బీఐ ట్రెజరీ చెల్లింపులకు ఆమోదం తెలిపే పద్ధతి మొదలైంది.

ఎప్పుడు వస్తాయో చెప్పట్లేదు...

ఈసారి కరోనా కారణంగా ఆయా శాఖల నుంచి ఆదాయం రాకపోవడం.. తాజాగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడం వల్ల ప్రభుత్వ ఖజానా ఖాళీ అయిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితి గతంలో ఎప్పుడూ ఎదుర్కోలేదని చెబుతున్న ట్రెజరీ అధికారులు.. త్వరలో వేతనాలు, పింఛన్లు ఖాతాల్లో జమ కావచ్చంటున్నా... ఎప్పుడు వస్తాయో మాత్రం చెప్పలేమని చేతులెత్తేస్తున్నారు.

జిల్లాల వారీగా వేతనాలు జమ చేస్తున్న ప్రభుత్వం... వేతనంపై ఆధారపడి కాలం వెళ్లదీసే వెనకబడ్డ ఆదిలాబాద్‌ జిల్లాకు వేతన చెల్లింపుల్లో ఇప్పటికైనా తొలి ప్రాధాన్యం ఇవ్వాలని సంబంధీకులు కోరుతున్నారు.

ఇదీ చూడండి: 12 లక్షల కారు గెలుచుకున్నారని 6 లక్షలు నొక్కేశాడు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.