ఈనెల 24 నుంచి ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్ నాగోబా జాతర ప్రారంభం కానుంది. నాగోబా ఆలయంలో నిర్వహించే ప్రత్యేక పూజలకు అత్యంత పవిత్రమైన జలాన్ని ఉపయోగిస్తున్నారు.
ఈ గంగాజలాన్ని తీసుకురావడానికి మెస్రం వంశీయులు కేస్లాపూర్ నుంచి కాలినడకన మంచిర్యాల జిల్లా జన్నారానికి బయలుదేరారు. బయలుదేరేముందు ప్రత్యేక పూజలు నిర్వహించి, సహపంక్తి భోజనం చేశారు.
చెప్పులు లేకుండా కఠోడా ఆధ్వర్యంలో కాలినడకన గోదావరి జలాల కోసం వందలాది మెస్రం వంశీయులు బయలుదేరారు.
- ఇదీ చూడండి : ముద్దుగుమ్మ అంజలికి ప్రపోజ్ చేసిన ఆ హీరో?