ETV Bharat / state

నేటి నుంచే అడవి బిడ్డల 'నాగోబా' జాతర ఆరంభం

Nagoba jatara in Adilabad: ఆదివాసీల జీవనంలో అంతర్భాగమైన నాగోబా జాతర ఇవాళ అర్ధరాత్రి అట్టహాసంగా ప్రారంభం కానుంది. అడవిబిడ్డల ఆరాధ్యదైవం.. మెస్రం వంశీయుల సంప్రదాయ పూజలందుకోనుంది. పక్షం రోజులుగా సాగుతున్న మెస్రం వంశీయుల పాదయాత్ర ఇప్పటికే కేస్లాపూర్‌ చేరుకుంది. మర్రిచెట్టు నీడలో సేదతీరిన ఆదివాసీలు అర్ధరాత్రి వేళ నాగదేవతకు గంగాజలం అభిషేకం చేయడంతో నాగోబా క్రతవు ప్రారంభమవుతుంది.

నాగోబా" జాతర
నాగోబా" జాతర
author img

By

Published : Jan 21, 2023, 1:48 PM IST

Nagoba jatara in Adilabad: ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి కొండల్లో నాగోబా జాతరకు రంగం సిద్ధమైంది. మెస్రం వంశస్తులు తరతరాలుగా భక్తి, శ్రద్ధలతో పాటిస్తున్న ఆచార వ్యవహారాలు నాగోబా వేడుకలకు తలమానికంగా నిలుస్తున్నాయి. అందులో భాగంగా ఇవాళ రాత్రి నాగదేవతకు సంప్రదాయ పూజలు నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా ఉండే ఆదివాసి మెస్రం వంశీయులు ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో వెలసిన నాగోబా దేవత వద్ద కలుసుకోవాలనేది అనాధిగా వస్తున్న ఆచారం. జాతరకు వీరంతా ఎడ్లబండ్లపై వస్తారు.

Nagoba jatara 2023 : నాగోబా వ్రతం ఆచరిస్తున్న మెస్రం వంశీయులు కాలినడకన 15 రోజుల పాటు ప్రయాణించి, గోదావరి నది నుంచి మట్టి కుండల్లో నీళ్లు తెస్తారు. ఆ నీటిని పవిత్ర గంగాజలంగా భావిస్తారు. ప్రయాణ బడలిక తీరేందుకు కేస్లాపూర్ సమీపంలో మర్రిచెట్టు కింద సేదతీరుతారు. తుడుంమోతలు, సన్నాయి వాయిద్యాల మోగిస్తూ.. అర్ధరాత్రి నాగోబా దేవతను అభిషేకం చేయడంతో మహాక్రతువు ప్రారంభం కానుంది.

నాగోబా సన్నిధిలో బేటి పేరిట మొక్కు తీర్చుకుంటేనే..పెళ్లయిన మహిళలకు మెస్రం వంశీయుల కోడలిగా గుర్తింపు లభిస్తోంది. ఇక్కడ కర్మకాండ చేస్తేనే కాలం చేసినవారికి మోక్షం లభిస్తుంది.మెస్రం వంశీయులు రూ. 5కోట్ల స్వచ్ఛంద విరాళాలతో నూతనంగా నిర్మించిన గర్భగుడిలో మహాపూజ క్రతువు జరగనుంది. కేస్లాపూర్‌ వేదికగా ఉట్నూర్‌ ఐటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహించే అధికార దర్భార్‌ ఈనెల 24న జరగనుంది.

మెస్రం వంశీయుల సంప్రదాయాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఐటీడీఏ ఏర్పాట్లు చేస్తోంది. అక్షరాస్యులు, నిరక్ష్యరాస్యులు... పిల్లలైన... జీవిత చరమాంకంలోకి చేరుకున్న వృద్దులైన.. నాగోబా సన్నిధిలో అందరూ సమానులనే భావన కనిపిస్తుంది. ఎంత నిష్టతో పూజలు చేస్తే... జనావళికి అంత మేలు జరుగుతుందనేది మెస్రం వంశీయుల విశ్వాసంగా ఇప్పటికీ చెక్కుచెదరకుండా కొనసాగుతోంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.