ఆదిలాబాద్ పట్టణం కుమార్‌పేట్‌లో ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమాన్ని భాజపా ఎంపీ సోయం బాపురావు ప్రారంభించారు. పార్టీ శ్రేణులతో కలసి... ప్రతిజ్ఞ చేయించి... ఇంటింటికి ప్రధాని మోదీ సందేశంతో కూడిన లేఖలు అందించారు.
మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చేసిన సేవలను తెలియజేసేలా కరపత్రాలు సృష్టించినట్లు ఎంపీ తెలిపారు. కొవిడ్‌పై పోరాటంలో భాగంగా 20లక్షల కోట్ల నిధులు కేటాయించారని తెలిపారు. మోదీ ప్రవేశ పెట్టిని పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే దీని ముఖ్య ఉద్దేశమని ఎంపీ వెల్లడించారు.
ఇవీ చూడండి: కూలీ పని చేసుకుంటున్న డిప్యూటీ ఎమ్మార్వో