ఆదిలాబాద్ జిల్లాలో మిషన్ భగీరథ నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. తలమడుగు మండలం సుంకిడి గ్రామగుట్టపై 250 కిలో లీటర్ల సామర్థ్యంతో నిర్మించిన ట్యాంకు ద్వారా... తలమడుగు, తాంసి, భీంపూర్ మండలాలలోని109 గ్రామాలకు నీటి సరఫరా కావాల్సి ఉంది.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి ట్యాంకుకు వచ్చి చేరుతున్న నీరు అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల పైపుల ద్వారా వృథాగా పోతోంది. దీంతో సుంకిడి గుట్టకింది భాగంలో నిరుపయోగంగా ఉన్న చెరువు నిండిపోయి జలకళను సంతరించుకుంది. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు.
- ఇదీ చూడండి : రోడ్డుపై 'వెండి వర్షం'.. ఎగబడ్డ జనం