రైతులు విజయ డెయిరీకి పాలు విక్రయించి లాభాలు గడించాలని పాడిపరిశ్రమ సహకార సమాఖ్య రాష్ట్ర ఛైర్మన్ లోక భూమారెడ్డి కోరారు. విజయ డెయిరీ ఆధ్వర్యంలో ఆదిలాబాద్లో శుద్ధజల పంపిణీ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
కామారెడ్డి సమీపంలో సమీపంలో రూ.180 కోట్ల నిధులతో మెగా డెయిరీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు భూమారెడ్డి వెల్లడించారు. ఆదిలాబాద్ జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా విజయ డెయిరీ సాధించిన విజయాలు, అభివృద్ధికి చేపడుతున్న కార్యక్రమాల గురించి వివరించారు.