ETV Bharat / state

TRS-BJP Godava: ఎమ్మెల్యే సమక్షంలోనే భాజపా, తెరాస శ్రేణుల గొడవ - జైనథ్ మండలంలో గొడవ

ఆదిలాబాద్ జిల్లాలో మండల సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. జైనథ్ మండలంలో తెరాస, భాజపా శ్రేణుల మధ్య గొడవ తలెత్తింది. శాసనసభ్యులు జోగు రామన్న నేతృత్వంలో జరిగిన సమావేశంలోనే గందరగోళ పరిస్థితి ఏర్పడింది.

godava
ఎమ్మెల్యే సమక్షంలో భాజపా, తెరాస శ్రేణుల గొడవ
author img

By

Published : Sep 9, 2021, 8:56 PM IST

ఆదిలాబాద్‌ జిల్లా జైనథ్‌ మండల సర్వసభ్య సమావేశం గందరగోళానికి దారితీసింది. ఈ భేటీలో తెరాస, భాజపా శ్రేణులు గొడవకు దిగాయి. స్థానిక శాసనసభ్యులు జోగు రామన్న నేతృత్వంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఈ పరిస్థితి నెలకొంది. సమావేశ మందిరం నుంచి ఎమ్మెల్యే జోగు రామన్న బయటకు వెళ్లే క్రమంలో ఇరు వర్గాలు గొడవకు దిగాయి.

మండలంలోని ఆడ గ్రామ సర్పంచ్ అయిన భాజపా జిల్లా అధ్యక్షుడు పాయల్‌ శంకర్‌ తనయుడైన పాయల్‌ శరత్‌ ప్రత్యేక అభివృద్ధి ఫండ్‌ (ఎస్‌డీఎఫ్‌) నిధుల వినియోగంపై ప్రశ్నించారు. ఎమ్మెల్యే సిఫారసు తెస్తేనే అధికారులు.. నిధులు కేటాయిస్తామంటున్నారని శరత్‌ ప్రశ్నించారు.

అదే సమయంలో ఆకోలి గ్రామ సర్పంచు వాణి భర్త అయిన కేశవ్‌ అడ్డుతగిలారు. దాంతో శరత్‌, కేశవ్‌ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఎమ్మెల్యే రామన్న వెళ్లిపోయిన తరువాత కూడా తెరాస, భాజపా శ్రేణులు పరస్పరం వాగ్వావాదానికి దిగడంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అనంతరం మండలాధ్యక్షుడు మార్చెట్టి గోవర్దన్, పోలీసుల జోక్యంతో వివాదం సద్దుమణిగింది.

సర్వసభ్య సమావేశం రసాభాస

ఇదీ చూడండి: ఎద్దులకూ ఓ పండుగ ఉంది... ఎక్కడ చేస్తారో తెలుసా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.