ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం అర్లిటీ గ్రామంతోపాటు వడూరు, అంతర్గావ్, గోముత్రి, కరంజి, గుబిడి, గొల్లఘాట్, తాంసి కె , బేలా, జైనథ్ మండలంలోని పెన్ గంగ పరివాహక ప్రాంతాలు డిసెంబరు మాసం వచ్చిందంటే చాలు.. హైరానా పడుతున్నాయి. గత ఏడాది డిసెంబర్ 31న అర్లిటీ గ్రామంలో ఏకంగా 2.7 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంింది. ఈ నెల 22న అత్యల్ప ఉష్ణోగ్రత 3.6 డిగ్రీలకు పడిపోవడం.. వచ్చే రెండు మూడు రోజుల్లో శీతల గాలుల ప్రభావంతో ఆదిలాబాద్ జిల్లాలో పలుచోట్ల రికార్డు స్థాయిలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అంచనా వేయడం మరింత ఆందోళనకు దారి తీస్తోంది. మనుషులతో పాటు మూగజీవాలు చలి ప్రభావానికి అల్లాడి పోతున్నాయి.
చలిని తట్టుకోలేక పోతున్నామని వృద్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భానుడు నెత్తిన వచ్చాకే పొలం పనులకు వెళ్తున్నామని రైతులు చెబుతున్నారు. పశువులకు గొనె తట్లు కప్పుతూ, మంటల వద్ద, ఎండలో ఉంచుతూ వాటిని చలి నుంచి కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. వారం రోజులుగా పెను గంగా సరిహద్దు ప్రాంతాల్లో మూడు నుంచి ఏడు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడం స్థానికులను అవస్థలకు గురిచేస్తోంది.
ఇదీ చదవండి: తొలిరోజు ఆట అదుర్స్.. జింక్స్పై ప్రశంసలు!