ETV Bharat / state

వణికిస్తోంది.. చిరుత దాడిలో మరో ఆవు బలి - adilabad latest news

ఆదిలాబాద్​ జిల్లాలో మళ్లీ చిరుత భయం నెలకొంది. పది రోజుల వ్యవధిలోనే రెండు ఆవులను హతమార్చి... స్థానికులను వణికిస్తోంది. బయటకు రావాలంటేనే భయపడిపోవాల్సిన పరిస్థితి నెలకొందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

Leopard attack on cow in marlapalle
Leopard attack on cow in marlapalle
author img

By

Published : Feb 2, 2021, 6:37 PM IST

కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లాలో పెద్దపులి సంచారం ప్రజలను వణికిస్తోంటే... ఆదిలాబాద్‌ జిల్లాలో చిరుతపులి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. బోథ్‌ మండలంలోని మర్లపెల్లి అటవీప్రాంతంలో చిరుతపులి ఓ ఆవును హతమార్చటం స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. పదిరోజుల వ్యవధిలో చిరుతపులి రెండు ఆవులను హతమార్చటం వల్ల స్థానికులకు భయం పెరిగిపోతోంది.

పదిరోజుల కిందట కంటేగాం- మర్లపెల్లి సెక్టార్ పరిధిలో చిరుత ఓ ఆవును చంపింది. తాజాగా మర్లపెల్లి- పట్నాపూర్‌ బీట్‌ పరిధిలో గ్రామానికి చెందిన వెల్మల నారాయణకు చెందిన ఆవును హతమార్చడం వల్ల స్థానికుల్లో భయం తీవ్రతరమైంది. అటవీశాఖ అధికారులు స్పందించడంలేదనే ఆరోపణలు స్థానికుల నుంచి వినిపిస్తుంటే... ప్రజలు భయాందోళనకు గురికావాల్సిన అవసరంలేదని అధికారులు అనటం గమనార్హం.

ఇదీ చూడండి: ఈటీవీ భారత్​ కథనానికి స్పందన.. బాధితుడికి అండగా నిలిచిన దాతలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.