ETV Bharat / state

Kumdisheku guda Villagers Protest : గుక్కెడు నీటి కోసం ఊరంతా కదిలింది.. - నీటి సమస్య పరిష్కరించాలంటూ కుండిషేకుగూడ వాసుల ధర్నా

Kumdisheku guda Villagers Protest : పాలుతాగే పసి బిడ్డ నుంచి పండు ముసలి వరకు నిరసన చేపట్టారు. ఊరి బాగు కోసం కదిలిన ఊరంతా.. సుమారు 70 కిలోమీటర్లు పాదయాత్ర చేసి కలెక్టర్​ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. అర్జీలతో అలసిపోయి.. హామీలతో విసుగుపోయిన జనం.. పరిష్కారం కోసం మూకుమ్మడిగా కదిలారు. తమ సమస్యకు స్పష్టమైన పరిష్కారం వచ్చే వరకు కదలనంటున్నారు. అసలు వారి సమస్య ఏమిటో తెలుసుకోవాలంటే ఆదిలాబాద్​ కలెక్టరేట్​ వద్ద నిరసన చేస్తున్న కుండిషేకుగూడ వాసులను అడగాల్సిందే..

Villagers Protest
Villagers Protest
author img

By

Published : Feb 8, 2022, 9:31 PM IST

గుక్కెడు నీటి కోసం ఊరంతా కదిలింది..

Kumdisheku guda Villagers Protest : ఎన్నికల సమయంలో ఓటరు ఏమూలన ఉన్నా నేతలకు కనిపిస్తారు.. నియోజకవర్గంలోని కష్టాలు తమ కష్టాల్లోనా భావిస్తారు. కానీ తీరా గెలిచి పదవి చేపట్టిన తర్వాత ఆ ఓటరు కనిపించడు.. ఊళ్లోని సమస్యలు కనిపించవు.. గట్టిగా మాట్లాడితే ప్రజలకు పాలకులు కనిపించరు. తమ ఊరి బాగుకోసం ఎన్నోసార్లు ప్రజా ప్రతినిధులకు విన్నవించుకున్నా కరుణించకపోయేసరికి.. తమ సమస్యను పరిష్కరించుకోవడానికి ఊరు ఊరే కదిలింది. సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న కలెక్టర్​ కార్యాలయం వరకు పాదయాత్ర చేపట్టి.. నిరసనకు దిగారు ఆదిలాబాద్​లోని ఓ గిరిజన గూడెం ప్రజలు.

వారి సమస్య ఏమిటంటే..

ఆదిలాబాద్​లోని గాదిగూడ మండలంలోని ఆదివాసీ గ్రామమైన కుండిషేకుగూడ.. అభివృద్ధికి దూరంగా..కష్టాలకు చేరువగా ఉంటుంది. తమ ఊరి బాగుకోసం ఎన్నో ఏళ్లుగా కనిపించిన అధికారులను, ఓట్ల కోసం వచ్చిన ప్రజా ప్రతినిధులను వేడుకుంటూనే ఉన్నారు. తాగునీటి పరిష్కారం కోసం గొంతు ఎండిపోయేలా వేడుకున్న ప్రజలు.. ఇప్పుడు గొంతెత్తి ప్రశ్నిస్తున్నారు. లెక్కలేనన్ని అర్జీలతో విసుగుపోయిన స్థానికులు తమ సమస్యను ఊరంతా ఏకమై పరిష్కరించుకోవాలనుకున్నారు. సీపీఎం ఆధ్వర్యంలో సోమవారం పిల్లాపాపలతో కలిసి గ్రామానికి 70కిలోమీటర్ల దూరంలో ఉన్న కలెక్టర్​ కార్యాలయానికి పాదయాత్రగా తరలివచ్చారు. తమ గ్రామంలో తాగు నీటి సమస్యకు పరిష్కారం కోరుతూ కలెక్టరేట్​ ఎదుట నిరసకు దిగారు.

అప్పటి వరకు తగ్గేదే లేదు..

రాత్రి అక్కడే పడుకుని రెండో రోజైన మంగళవారం కూడా తమ నిరసన కొనసాగించారు. చిన్నా, పెద్దా, మహిళలు, దివ్యాంగులు, వృద్ధులు సహా అందరూ ధర్నాలో పాల్గొన్నారు. అధికారుల నుంచి స్పష్టమైన హామీ వచ్చేవరకు కలెక్టరేట్‌ ఎదుట నుంచి కదలేది లేదని స్పష్టం చేస్తున్నారు. ఊరి బాగు కోసం చేస్తున్న కుండిషేకుగూడ ప్రజల ఐక్యతకు సీపీఎ రాష్ట్రనాయకత్వం సంఘీభావం ప్రకటించింది.

ఇదీ చూడండి : Bus ticket to Cock: బస్సెక్కిన కోడి.. టికెట్​ కొట్టిన కండక్టర్​.. స్పందించిన సజ్జనార్​..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.