ETV Bharat / state

ఆదిలాబాద్ జిల్లాలో వెలుగులోకి మరో జలపాతం

ఎత్తైన కొండలు... పచ్చని చెట్లు... ఆ కొండలపై నుంచి వచ్చే పాలలాంటి ధారలు... దూరం నుంచి చూస్తే అదేదో పాలసంద్రమే అయ్యుంటందనేలా ఉంటుంది. కానీ దగ్గరకు వెళ్లి చూస్తేనే తెలుస్తుంది అవి పాలు కాదు స్వచ్ఛమైన నీళ్లు అని. అది ప్రకృతి ప్రసాదించిన అందమైన జలపాతమని.

author img

By

Published : Jul 27, 2019, 4:38 PM IST

Updated : Jul 27, 2019, 4:55 PM IST

ఆదిలాబాద్ జిల్లాలో బయటపడ్డ మరో జలపాతం
ఆదిలాబాద్ జిల్లాలో బయటపడ్డ మరో జలపాతం

నిర్మల్ నుంచి ఆదిలాబాద్ వైపు వెళ్తుంటే... రహదారి వెంబడంతా దట్టమైన అడవి ప్రాంతం. మనం ఎంత మేర ప్రయాణం చేసినా అలుపు రాకుండా చేసే పచ్చని ప్రకృతి. రోడ్డ దగ్గర దిగి కాస్త ఆ ప్రకృతి అందాలను ఆస్వాదించాలని చూస్తుంటే... గలగలమంటూ ఉరికే సెలయేరు చప్పుళ్లు వినిపిస్తాయి. దగ్గరకు వెళ్తే తప్ప అవి జలపాతాలు అని తెలియదు. తెలంగాణ రాష్ట్రానికి కశ్మీర్​గా పేరు తెచ్చిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దాగి ఉన్న జలపాతాలెన్నో.

ఆదిలాబాద్ జిల్లాలో మనకు తెలిసిన జలపాతాలు రెండే రెండు. ఒకటి కుంటాల మరొకటి కొచ్చర జలపాతాలు. కానీ మనకు తెలియకుండా జిల్లాలో మరిన్ని జలపాతాలున్నాయి. పక్కనే ఉన్న పల్లె వాసులకు తప్ప అవి ఇంకెవరికీ తెలియవు. అలాంటి జలపాతమే కొరటికల్ జలపాతం. నేరడిగొండ మండలం కొరటికల్ గ్రామ సమీపంలో ఉన్న ఈ జలపాతం నాలుగు వరసల జాతీయ రహదారి పక్కనే ఉంటుంది. చిన్నపాటి వర్షం కురిస్తే చాలు... ప్రకృతి ప్రేమికలను కనువిందు చేస్తుంది. పచ్చని అడవిలోంచి సన్నని వాగులా కదిలొస్తూ... నల్లటి బండలపై నుంచి పాలధారలా కిందకు ఉరికి వస్తుంది గంగమ్మ.

ఇలాంటి జలపాతాలను ప్రభుత్వం పట్టించుకొని పర్యటక ప్రాంతంగా ఏర్పాటు చేస్తే బాగుంటుందని ప్రకృతి ప్రేమికులు చెబుతున్నారు. చిన్న పిల్లలు వచ్చేందుకు వీలుగా... చిన్న పాటి పార్కు ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుందంటున్నారు.

కేవలం పర్యాటక ప్రాంతంగానే కాకుండా ఇక్కడ ఉన్న గిరిజన ప్రజలకు కూడా ఉపాధి దొరికే అవకాశం ఉంటుందని స్థానికులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం చొరవ చూపి కొరటికల్ జలపాతాన్ని అభివృద్ధి పరచాలని కోరుతున్నారు.

ఇవీ చూడండి: మిట్టమధ్యాహ్నం మహిళ మెడలోంచి గొలుసు చోరీ

Intro:hyd_tg_31_27_kalyanalakshmi_cheks_distrubuted_ab_TS10056
Lsnraju:9394450162
యాంకర్:

Body:దేశంలో ఎక్కడాలేని విధంగా కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టి తల్లిదండ్రులను ఆదుకుంటున్న ఘనత కేసీఆర్ కే దక్కిందని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అన్నారు
సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో కల్యాణ లక్ష్మి లబ్ధిదారులకు 62 చెక్కులను ఆయన అందించారు తెలంగాణ రాష్ట్రం వచ్చాక పేద తల్లిదండ్రులు ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో ఈ పథకం ప్రవేశపెట్టారని అన్నారు ఎంతమంది ఎంతమంది ముఖ్యమంత్రి వచ్చినా ఎన్ని ప్రభుత్వాలు మారినా ప్రజల గురించి ఆలోచించే వారు లేకపోవడం విచారకరమన్నారు లబ్ధిదారుల అందరూ వీటిని సద్వినియోగం చేసుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వదించాలని ఆయన కోరారు

Conclusion:బైట్ మహిపాల్ రెడ్డి ఎమ్మెల్యే పటాన్చెరు
Last Updated : Jul 27, 2019, 4:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.