ETV Bharat / state

Karthika Deepothsavam: ఆదిలాబాద్​లో ఆధ్యాత్మికం.. కన్నుల పండువగా కార్తిక దీపోత్సవం - karthika maha deepothsavam in adilabad

ఆదిలాబాద్​లో శనివారం రాత్రి కార్తిక మహా దీపోత్సవం నిర్వహించారు. ఎమ్మెల్యే జోగు రామన్న జోగు ఫౌండేషన్​ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. దీపోత్సవంతో ఆదిలాబాద్​ డైట్​ మైదానం ఆధ్యాత్మికతను సంతరించుకుంది.

karthika maha deepothsavam
ఆదిలాబాద్​లో కార్తిక దీపోత్సవం
author img

By

Published : Nov 7, 2021, 10:56 AM IST

కార్తిక మాసం సందర్భంగా రాష్ట్రంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కాగా ఈ మాసంలో దీపోత్సవం ప్రత్యేకతను సంతరించుకుంటుంది. మహిళలంతా కలిసి సామూహికంగా పరమశివుడిని ప్రార్థిస్తూ దీపాలను వెలిగిస్తారు. ఇక కార్తిక పౌర్ణమి రోజు 365 ఒత్తులతో దీపాలను వెలిగించి.. నైవేద్యాలను సమర్పించి కోరిన కోర్కెలు తీర్చాలంటూ ఆ నీలకంఠేశ్వరుడిని ప్రార్థిస్తారు.

karthika maha deepothsavam
సామూహిక కార్తిక దీపోత్సవం

ఇక ఆదిలాబాద్​ జిల్లా కేంద్రంలో మహిళలంతా కలిసి మహా దీపోత్సవం నిర్వహించారు. ఈ వేడుక కన్నులపండువగా సాగింది. ఆదిలాబాద్​ డైట్​ మైదానం దీపాలతో వెలుగులీనింది. పెద్ద ఎత్తున మహిళలు తరలివచ్చి.. శివయ్యకు పూజలు నిర్వహించారు. జోగు ఫౌండేషన్​ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి.. ఎమ్మెల్యే, ఫౌండేషన్ ఛైర్మన్​ జోగు రామన్న, జడ్పీ ఛైర్మన్​ రాథోడ్​ జనార్దన్​, గోపాల కృష్ణ మఠాధిపతి యోగానంద సరస్వతి హాజరయ్యారు.

karthika maha deepothsavam
పరమేశ్వరునికి దీపోత్సవం చేసి

వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ మహిళలు దీపాలను వెలిగించారు. దీపాల వెలుగులతో డైట్ మైదానం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. సాంస్కృతిక ప్రదర్శనలు ఈ కార్యక్రమానికి మరింత వన్నె తెచ్చాయి. మహిళలంతా ఒక్కచోట చేరి కార్తికమాసం పూజలు నిర్వహించాలనే ఉద్దేశంతో దీపోత్సవం నిర్వహించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. లోక కళ్యాణార్థం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

karthika maha deepothsavam
కార్తిక దీపాలు వెలిగించిన యువతులు

ఇదీ చదవండి: Sadar Celebrations: అంబరాన్ని అంటేలా సదర్​ సంబురాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.