ఆదిలాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలం సార్సాలలో అటవీ శాఖ అధికారులపై జరిగిన దాడిని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఖండించారు. అధికారులపై దాడులు చేయటం సరైన విధానం కాదని మంత్రి అభిప్రాయపడ్డారు. ఉట్నూరులో పర్యటించిన మంత్రి.... నూతనంగా నిర్మించిన ఎంపీడీవో భవనాన్ని ప్రారంభించారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని కాపాడేందుకు కృషి చేయాలని సూచించారు. అడవులను సంరక్షించేందుకు ఆ శాఖ అధికారులతో పాటు అందరం కృషి చేయాలని సూచించారు. అనంతరం కార్యాలయ ప్రాంగణంలో ఎమ్మెల్యే రేఖానాయక్‌తో కలిసి మొక్కలు నాటారు.
ఇదీ చూడండి:లోయలో పడ్డ పాఠశాల బస్సు- నలుగురు మృతి