ఆదిలాబాద్ జిల్లాలో కొందరు రెవెన్యూ అధికారుల అక్రమాలు.. ఆ శాఖకే అపఖ్యాతి తెచ్చిపెడుతున్నాయి. స్థిరాస్తి వ్యాపారులు చెప్పినట్లు తలలూపే అధికారులే కాకుండా మరికొందరు సామాన్యుల బతుకులతో చెలగాటం ఆడుతున్నారు. కుటుంబ వారసుల్లో 16 మంది బతికుండగానే ఎవరూలేరని ధ్రువీకరణ పత్రం జారీ చేసి ఒక్కరికే భూమి రిజిస్ట్రేషన్ చేశారు.
అసలు ఆ భూమిపై ఎవరికి హక్కు ఉంది: బాధితుడు, తమ కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా బజార్‌హత్నూర్ మండలం టెంబి గ్రామానికి చెందిన జల్బా(76)కు బతికి ఉంటుండగానే చనిపోయినట్టు ధ్రువీకరణ పత్రం అధికారులు ఇచ్చారు. జల్భా తాత సంత్యా. ఆయన పేరిట టెంబిలో 25 ఎకరాల లావనీ భూమి ఉంది. సంత్యా సహా ఆయన ముగ్గురు కొడుకులు దశాబ్ధాల క్రితం కాలం చేశారు. ఆ ముగ్గురి సంతానంలో పెద్దాయన జల్భా సహా 16 మంది వారసులకు 25 ఎకరాలపై హక్కు ఉంది.
అవినీతికి పాల్పడిన రెవెన్యూ సిబ్బంది: కాసులకు కక్కుర్తిపడిన రెవెన్యూ సిబ్బంది 16 మంది సమ్మతి తీసుకోకుండానే కేవలం ఒక్కరి పేరిట 6.17 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేశారు. పైగా వారుసుల్లో ఒక్కరే బతికి ఉన్నట్లు గతేడాది జులై 29న ధ్రువీకరణ పత్రం జారీ చేసిన విషయంలో వెలుగులోకి వచ్చింది. ఇదేంటని ప్రశ్నిస్తే అధికారులు బెదిరించారని వారసులు వాపోతున్నారు.
వీఆర్ఓ నేనా ప్రధాన సూత్రధారి: వాస్తవాలను ఆరాతీసిన ఈటీవీ భారత్.. సంబంధిత రెవెన్యూ అధికారులను సంప్రదిస్తే అందుబాటులోకి రాలేదు. చివరకు చరవాణిలో మాట్లాడితే తప్పు జరిగినట్లు చెప్పడం అక్రమాలకు బలం చేకూరుస్తోంది. అప్పట్లో అక్కడ ఉన్న వీఆర్ఓ వల్లే తప్పు జరిగిందని రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ మరళి తెలిపారు.
రెవెన్యూ అధికారులపై విమర్శలు: ఆదిలాబాద్ మున్సిపాల్టీ పరిధిలోని బట్టిసావర్గాం, మావల, కేఆర్కే కాలనీ సమీపంలోని ప్రభుత్వ భూమిపై అక్రమార్కులు కన్నుపడినట్లు తెలుస్తోంది ఇచ్చోడ, నేరడిగొండ, బోథ్, బజార్‌హత్నూర్, తలమడుగు మండలాల్లో స్థిరాస్తి వ్యాపారుల భూదందాకు కొందరు రెవెన్యూ అధికారులు అండగా నిలుస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
"భూమి రిజిస్ట్రేషన్లుల ఎవరికైనా ఎజెన్సీ, నాన్ ఎజెన్సీ అని చూడకుండా అధికారులు చేస్తున్నారు. పైసలు ఇస్తే సులభంగా రిజిస్ట్రేషన్ పరిస్థితి వచ్చింది. దీనిపై సరైనా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను." - గణేష్, వారసుడు, ఆదిలాబాద్ జిల్లా
ఇవీ చదవండి: