ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏప్రిల్ 1 నుంచి ఇప్పపువ్వుతో తయారు చేసిన లడ్డూలు పంపిణీ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఐటీడీఏ పరిధిలోని 82 అంగన్వాడీ కేంద్రాల ద్వారా 3,257 మంది గర్భిణులకు లడ్డూలు అందిస్తామన్నారు. గర్భిణుల్లో రక్తహీనతను నివారించేందుకు 6నెలల పాటు లడ్డూలు అందించాలని గిరిజన సంక్షేమ శాఖ నిర్ణయించింది. ఇందుకోసం పది లక్షల నిధులు కేటాయించినట్లు తెలిపారు.
ఏజెన్సీ ప్రాంతాల్లోని గర్భిణులు చాలా మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. ఎర్రరక్తకణాలు తగ్గిపోవడం వల్ల వ్యాధినిరోధక శక్తి క్షీణించి పలు వ్యాధుల బారిన పడుతున్నారు. ప్రసవ సమయంలో రక్తస్రావమై తల్లీబిడ్డలు మృతి చెందిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి ప్రాంతాల్లో లక్ష మంది గర్భిణుల్లో 152 మంది, 1000 మంది నవజాత శిశువుల్లో 43 మంది మరణిస్తున్నారని కేంద్ర గణాంకాలు చెబుతున్నాయి.
ఇదీ చూడండి: నేడు రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు, ఈదురుగాలులు