ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని బాలుర గిరిజన గురుకుల పాఠశాలలో ఉమ్మడి జిల్లా విజ్ఞాన మేళా నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా 540 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ప్రదర్శనలో ఆధునిక డిజిటల్ మోడల్స్, కాలుష్యం నివారణ ప్రయోగాలు, నూతన ఆవిష్కరణలు, పోషకాహారం, రోబోటిక్స్, పలు శాస్త్రీయమైన అంశాలను ప్రదర్శించారు.
ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా ప్రాంతీయ సమన్వయ కర్త లక్ష్మయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థుల్లో సృజనాత్మక శక్తిని వెలికితీయడం కోసమే కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. మూఢ నమ్మకాలను విశ్వసించొద్దని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ ప్రీతం రెడ్డి, జడ్పీటీసీ కదం శుభద్ర బాయ, సర్పంచ్ సునీత, ప్రిన్సిపాల్ రాజేంద్ర ప్రసాద్ పాల్గొని విద్యార్థుల ప్రదర్శనలను తిలకించి వారిని అభినందించారు.
ఇదీ చూడండి : గుట్టుగా సాగుతున్న గంజాయి దందా