ETV Bharat / state

నేటితో ఇంద్రవెల్లి మారణకాండకు 38 ఏళ్లు - INDRAVELLI

వారికి మార్క్స్‌ బోధనలు తెలియవు . మావో పోరాట పటిమ తెలియదు.. పిడికిలెత్తి నినదిస్తే... ఉద్యమకారులంటారనే విషయమూ తెలియదు. వారసత్వంగా వస్తున్న దుర్భర దారిద్ర్యం.. వారిని ఎదురించేలా చేసింది. మెతుకు దొరకని ధైన్యం తిరుగుబాటుకు పురిగొల్పింది . ఆదిలాబాద్‌ జిల్లా చరిత్రలో రక్తపుమరకగా ప్రాచుర్యం పొందిన ఇంద్రవెల్లి పోలీసు కాల్పుల గాయంపై ప్రత్యేకకథనం.

నేటితో ఇంద్రవెల్లి మారణకాండకు 38 ఏళ్లు
author img

By

Published : Apr 20, 2019, 11:16 AM IST

ఆదిలాబాద్‌ జిల్లాలో చోటుచేసుకున్న... ఇంద్రవెల్లి పోలీసు కాల్పుల దురాగతం. అనేక సమస్యలతో కునారిల్లుతున్న ఆదివాసీలు ఏకతాటిపైకి వచ్చి భూమి, భుక్తి, విముక్తి నినాదంతో 1981 ఏప్రిల్‌ 20న ఇంద్రవెల్లిలో సభకు నగార మోగించేలా చేసింది. ఆరోజు జరిగిన పోలీసు కాల్పుల దురాగతం చరిత్రపుటల్లో చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది.

ఆదిలాబాద్‌ గిరిబిడ్డల కష్టాలను చూసి చలించిన అప్పటి రైతు కూలీ సంఘం 1981 ఏప్రిల్‌ 20న ఇంద్రవెల్లిలోభారీ సభ తలపెట్టింది. సభ నిర్వహణకు తొలుత అనుమతి ఇచ్చిన అప్పటి.. పోలీసు యంత్రాంగం... చివరి నిమిషంలో రద్దు చేసింది.

నేటితో ఇంద్రవెల్లి మారణకాండకు 38 ఏళ్లు

మచ్చగా మిగిలిన ఇంద్రవెల్లి కాల్పులు

ఉట్నూర్‌, నార్నూర్‌, ఇంద్రవెల్లి, ఆసిఫాబాద్, జైనూరు, కెరమెరి, తలమడుగు, తాంసి ప్రాంతాల నుంచి ఆదివాసీలు తండోపతండాలుగా తరలివచ్చారు. గిరిజన సంద్రంగా మారిన ఇంద్రవెల్లి సభలో ఓ గిరిజన మహిళపై కానిస్టేబులు అనుచితంగా ప్రవర్తించడం ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు తుపాకి గుళ్ల వర్షం కురిపించారు. మరో చీకటి అధ్యాయంగా ఇంద్రవెల్లి కాల్పులు మాయని మచ్చగా మిగిలాయి.

పూడ్చిపెట్టన చోటే భారీ స్థూపం

పోలీసు కాల్పుల్లో మరణించిన ఆదివాసీ... మృతదేహాలను... ఇంద్రవెల్లి దగ్గరలోని వ్యవసాయ బావిలోనే పూడ్చిపెట్టగా... అక్కడే భారీ స్థూపం నిర్మించారు. ఏటా ఏప్రిల్‌ 20 వస్తుందే చాలు... మావోయిస్టుల కదలికల పేరిట ఆ ప్రాంతం వైపు ఆదివాసీలను వెళ్లనీయకుండా అడ్డుకోవడం వారిలో ఆందోళనకు గురిచేస్తోంది.

ఇదీ చూడండి: హైదరాబాద్​లో కొనసాగుతున్న ఎన్​ఐఏ సోదాలు

For All Latest Updates

TAGGED:

INDRAVELLI
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.