వేసవిలో జరిగే అగ్ని ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించారు అగ్నిమాపక శాఖ అధికారులు. అగ్నిమాపక వారోత్సవాలను పురస్కరించుకుని ఆదిలాబాద్లో చేపట్టిన సిబ్బంది విన్యాసాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.
అగ్ని ప్రమాదాలు జరిగినపుడు ఎలా నివారించాలో తమ విన్యాసాలతో ప్రజలకు అవగాహన కల్పించారు. పెట్రోల్ బంకులో ప్రమాదం జరిగితే ఏం చేయాలో ప్రయోగాత్మకంగా చేసి చూపించారు. వారోత్సవాల సందర్భంగా అమరులను స్మరించుకుంటూ ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను అగ్నిమాపక శాఖ అధికారులు వివరించారు.