ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలంలో చెమ్మన్‌గూడలో అక్రమంగా నిల్వ ఉంచిన రూ. 2లక్షల విలువైన కలప పట్టుకోవడం ఘర్షణకు దారితీసింది. పక్కా సమాచారంతో చెమ్మన్‌గూడలో పోలీసుల బందోబస్తు మధ్య అటవీశాఖ సిబ్బంది సోదాలు చేపట్టారు. తనిఖీల్లో నాలుగు చోట్ల రూ.2లక్షల విలువ చేసే కలప బయటపడింది. అయితే.. ఆ సమయంలో స్థానికులు అటవీ సిబ్బంది, పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
అక్రమంగా కలప తరలిస్తున్న అసలు వ్యక్తులను వదిలేసి.. అటవీ సిబ్బంది సామాన్యులను భయభ్రాంతాలకు గురిచేసేలా సోదాలు చేస్తున్నారని ఆరోపిస్తూ గ్రామస్థులు అటవీ సిబ్బంది, పోలీసులతో వాగ్వాదానికి దిగడం ఉద్రిక్తతకు దారితీసింది. స్థానికులు తిరగబడటం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఉట్నూర్ డీఎస్పీ ఉదయ్ కుమార్రెడ్డి నేతృత్వంలో పరిస్థితి సద్దుమణిగేలా చర్యలు తీసుకున్నారు.
ఇదీ చూడండి: ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులను ఒత్తిడి చేశారు: ఎల్.రమణ