ETV Bharat / state

విలీన గ్రామాల్లో మళ్లీ మొదలైన అక్రమ లేఅవుట్ల దందా - illegal layouts news

స్థిరాస్తి వ్యాపారం జోరుగా కొనసాగుతున్న విలీన గ్రామాల్లో మళ్లీ అక్రమ లేఅవుట్ల దందాకు తెరలేచింది. ఆదిలాబాద్‌ పురపాలకంలో రెండేళ్ల కిందట విలీనమైన ఈ గ్రామాల్లో కొంతకాలంగా కొత్త లేఅవుట్ల ఏర్పాటు వ్యవహారం స్తబ్ధుగా ఉంది. తాజాగా మళ్లీ ప్లాట్లకోసం హద్దులు ఏర్పాటు చేస్తున్నారు.

illegal layouts in merged villages in adhilabad

author img

By

Published : Aug 6, 2020, 1:16 PM IST

ఆదిలాబాద్​ జిల్లాలో అక్రమ లేఅవుట్ల దందా మళ్లీ తెరమీదికొచ్చింది. ఏళ్లకిందట సర్పంచులు అనుమతి ఇచ్చినట్లు కాగితాలు సృష్టించి ప్లాట్లు విక్రయిస్తున్నారు. మావల మండల పరిధిలోకి వచ్చే పట్టణంలోని నాలుగు వరుసల రహదారి పక్కన కొత్త లేఅవుట్లు వెలిశాయి. కొత్తహౌసింగ్‌బోర్డు ఆవల సైతం ఇదే పద్ధతిలో లేఅవుట్లు ఏర్పాటుచేశారు. దుర్గానగర్‌ కాలనీలో పదుల సంఖ్యలో వాహనాలతో యుద్ధప్రాతిపదికన భూమిని ప్లాట్లకోసం చదును చేస్తున్నారు. శంకర్‌ గుట్ట సమీపంలో కొంత అసైన్డ్‌భూమిని సైతం కొందరు జేసీబీతో తవ్వేస్తున్నా రెవెన్యూ అధికారులు అటువైపు వెళ్లడం లేదు.

వాస్తవానికి పురపాలకంలో విలీనమైన గ్రామాల్లో కొత్త లేఅవుట్లు ఏర్పాటు చేయాలంటే అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఇంతకుముందులా వరంగల్‌, హైదరాబాద్‌ తరహాలో కాకుండా ఇక్కడే జిల్లా పాలనాధికారి ద్వారా అనుమతి ఇస్తామని ‘పుర’ అధికారులు చెబుతున్నారు. నిబంధనలు సులువుగా ఉన్నప్పటికీ స్థిరాస్తి వ్యాపారులు అక్రమ దందా వైపే మొగ్గు చూపుతున్నారు. సాధారణంగా రహదారులు 40 అడుగుల వెడల్పులో ఉండాలి. అదే అక్రమ లేఅవుట్లలో 20 అడుగుల వెడల్పుతోనే రహదారులు సరిపెడుతున్నారు. దీనికితోడు విద్యుత్తు, మురుగు కాలువల నిర్మాణం, తాగునీటి వంటి అన్ని వసతులు సదరు వ్యాపారే కల్పించాల్సి ఉండటంతో ఇది భారమని అనుమతి తీసుకోవడం లేదు. పుర అధికారులు పట్టించుకోకపోవడంతో అక్రమ దందా సాఫీగా సాగుతోంది.

కేసులు నమోదు చేస్తాం

పుర కమిషనర్‌, మారుతీప్రసాద్‌

అనుమతి లేని లేఅవుట్లు వేసే వ్యక్తులపై కేసులు నమోదు చేస్తాం. ఇప్పటికే దుర్గానగర్‌లో చేపడుతున్న పనులు ఆపాం. ఇతరచోట్ల పట్టణ ప్రణాళిక అధికారులను పంపించి చర్యలు తీసుకుంటాం. అనుమతి లేని ప్లాట్లకు రిజిస్ట్రేషన్‌ చేయద్దని ఆశాఖ అధికారులకు లిఖితపూర్వకంగా నివేదించాం.

ఇదీ చదవండి: ఇలా ఆవిరిపడితే ముఖం వెలిగిపోవాల్సిందే!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.