ఆదిలాబాద్ పట్టణంలో తితిదే కల్యాణ మండపం వద్ద తిరుపతి లడ్డూ కొనుగోలు కోసం భక్తులు బారులు తీరారు. లాక్‌డౌన్ నేపథ్యంలో తిరుమలేశుడి దర్శనాలు నిలిచిపోవడం వల్ల తితిదే లడ్డూలను అందుబాటులోకి తెచ్చింది.
మనిషికి రెండు లడ్డూలు..
ఈ నేపథ్యంలో లడ్డూల విక్రయాలు ప్రారంభమయ్యాయి. ఒక్కో వ్యక్తికి రెండేసి లడ్డూలు ఇస్తున్నారు. ఈ సందర్భంగా భక్తులు ఉదయం నుంచి బారులు తీరి వాటిని కొనుగోలు చేశారు. మండపంలోని ఏర్పాట్లను తితిదే ఆలయ కమిటీ సభ్యుడు అనిల్ పర్యవేక్షించారు. లడ్డూలు ప్రతి ఒక్కరికీ అందేలా చూస్తామని స్పష్టం చేశారు.