'కరోనా బాధితులకు అందని పౌష్టికాహారం.. కనిపించని కనికరం...' శీర్షికతో ఈనాడులో వచ్చిన కథనంపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సుమోటోగా కేసు స్వీకరించింది. కొవిడ్ వ్యాధిగ్రస్థులకు అందించే పౌష్టికాహారం విషయంలో.. ప్రభుత్వం స్పష్టమైన మార్గ దర్శకాలను జారీ చేసినప్పటికీ.. ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో అవి అమలు కాకపోవడంపై హెచ్ఆర్సీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
గుత్తేదారు సరఫరా చేసిన ఇడ్లీలో పురుగు రావడం వల్ల బాధితులెవరూ అల్పాహారం తీసుకోలేదని.. ఇంత జరిగినా సంబంధిత అధికారులు ఎందుకు స్పందించడం లేదని హెచ్ఆర్సీ ప్రశ్నించింది. ఈ సంఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని.. ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్, జిల్లా వైద్యాధికారి, రిమ్స్ ఆసుపత్రి సూపరెండెంట్కు ఆదేశాలు జారీ చేసింది.
ఇదీ చూడండి: సచివాలయం కూల్చివేతతో ఏర్పడే వ్యర్థాలను ఏం చేస్తారంటే..