ETV Bharat / state

కడుపులో ఉంది కవలలు... కాదు కాదు ట్యూమర్ - hospital fraud

వైద్యం కోసం వెళితే... రెండు నెలల గర్భం అని నిర్ధరించారు. కవలలు ఉన్నారంటూ ఊరించారు. ఆ తర్వాత నెలనెలా వైద్య పరీక్షలంటూ... డబ్బులు దండుకున్నారు. పరీక్షలు చేయించుకున్న రెండు ఆసుపత్రుల్లో ఇద్దరు వైద్యులు ఇలానే చేశారు. రిపోర్టులో ఓవరాన్​ట్యూమర్​ అని స్పష్టంగా ఉన్నా... గర్భం అని మోసం చేశారు. తీరా పది నెలల తర్వాత గర్భం కాదని ఊసురుమనిపించారు.

కడుపులో ఉంది కవలలు... కాదు కాదు ట్యూమర్
author img

By

Published : Sep 16, 2019, 11:24 PM IST

ఆదిలాబాద్​ జిల్లాలో ఓ ప్రైవేటు వైద్యుడి నిర్వాకం బయటపడింది. సిరికొండ మండలం సోంపల్లికి చెందిన బూసేవాడె సోని వైద్యపరీక్షల కోసం ఆసుపత్రికి వెళ్లింది. గర్భం దాల్చినట్లు నిర్ధరించి, కవలలు ఉన్నట్లు తెలిపారు. దాదాపు 7 నెలలుగా వైద్యపరీక్షల కోసం తిరిగిన తర్వాత... మరో వైద్యుడిని సంప్రదించారు. అక్కడ కూడా అన్ని పరీక్షలు చేసి మాయ కిందకు వచ్చింది తప్పనిసరిగా శస్త్రచికిత్స కోసం రిమ్స్​కు వెళ్లాలని సూచించాడు. రిమ్స్​లో రక్త, మూత్ర నమూనాలు తీసుకొని... రిపోర్టులు ఆలస్యంగా వస్తాయని సిబ్బంది చెప్పారు.

బాధితురాలు నిర్మల్ జిల్లా కేంద్రంలోని మరో ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోగా... ఓ వింత విషయం బయటపడింది. ఆ మహిళ అసలు గర్భం దాల్చలేదని, ఓ వింత వ్యాధితో బాధపడుతున్నట్లు నిర్ధరించారు. ఈ విషయం విన్న కుటుంబసభ్యులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. ప్రెగ్నెన్సీ ఉన్నట్లు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి 10 నెలలుగా వైద్యులు మోసం చేశారని ఆరోపిస్తున్నారు. ప్రెగ్నెన్సీ స్కానింగ్ రిపోర్టులో మాత్రం ఓవరాన్​ట్యూమర్​ ఉండటం గమనార్హం.

కడుపులో ఉంది కవలలు... కాదు కాదు ట్యూమర్

ఇదీ చూడండి: త్వరలో ఆమరణ నిరాహారదీక్ష: ఉత్తమ్

Intro:tg_adb_91_16_garbhinikaakunna_pareekshalu_ts10031

Body:ఏ. లక్ష్మణ్ ఇచ్చోడ జిల్లా ఆదిలాబాద్ 9490917560
.....

గర్భిణీ కాకున్నా వైద్య పరీక్షలు
*ఏజెన్సీలో నిర్లక్ష్య వైద్యం
....
( ):- ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని సోంపల్లి గ్రామానికి చెందిన బూసేవాడే సోనీ అనే మహిళ తను గర్భం దాల్చినట్లుగా అనుమానం రావడంతో ఆదిలాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యులను సంప్రదించారు. దీంతో వైద్య పరీక్షలు చేసి ఆమె రెండు నెలల గర్భవతి అని నిర్ధారించి కవల పిల్లలున్నారు అని చెప్పడంతో సంతోషపడింది 7 నెలల తర్వాత మరో వైద్యుడు నీ సంప్రదించారు అన్ని పరీక్షలు నిర్వహించిన మాయ కిందకు వచ్చిందని తప్పనిసరిగా శస్త్రచికిత్స చేయాలని సూచించారు మళ్లీ వెళ్లగా రిమ్స్ కు వెళ్ళండి అని చెప్పడంతో రిమ్స్ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు వైద్య సిబ్బంది 24 గంటల పాటు ఆస్పత్రిలో ఉంచుకొని రక్త మూత్ర పరీక్షలు నమూనాలు సేకరించి రిపోర్ట్ ఆలస్యంగా వస్తుందని తెలపడంతో నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లారు అక్కడ పరీక్షలు నిర్వహించిన వైద్య సిబ్బంది ఒక వింత వ్యాధితో ఆమెకు గర్భం దాల్చలేదని వింత వ్యాధితో బాధపడుతోందని కుటుంబ సభ్యులకు చెప్పడంతో ఒక్కసారిగా ఖంగుతిన్నారు ఇన్ని నెలల పాటు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ఇబ్బందులు పెట్టారని వాపోయారు ఇద్దరు ప్రైవేటు వైద్యులతో పాటు ఇచ్చోడ మండలం నర్సాపూర్ లో వైద్యులు పరీక్షించగా ఒకసారి గుర్తించ లేకపోయారు ఎలాంటి వైద్య పరీక్షలు జరపకుండా పంపించాలని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు దేవుడిగా భావించే వైద్యులు పరీక్షలు నిర్వహించకుండా మసిపూసి మారేడుకాయ చేసి ఈ కుటుంబాన్ని దాదాపు పది నెలల పాటు ఇబ్బందులకు గురిచేశారు గర్భిణి అని మోసగించారు ప్రెగ్నెన్సీ స్కానింగ్ రిపోర్టులో మాత్రం ఓవరాన్ట్యూమర్ సమస్య ఉండగా కనీసం ఈ విషయం కూడా బాధితులకు తెలియ చేయకపోవడం బాధాకరం

Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.