ETV Bharat / state

కారులో వజ్రాలు​ ఉన్నాయని 3 కార్లతో ఛేజింగ్​

ఓ కారులో వజ్రాలు ఉన్నాయని దుండగులు మూడు కార్లతో వెంబడించారు. చాలా సేపు ఛేజింగ్​ తర్వాత అడ్డగించారు. కారులో ఉన్నవారిని అపహరించి... వేరే చోట వదిలేశారు. కారును వేరే రాష్ట్రం తీసుకెళ్లి అంతా వెతికారు. చివరికి అందులో ఏమీ దొరకలేదు.... ఇదేదో సినిమా కథ కాదండోయ్​... ఆదిలాబాద్​ జిల్లా గుడిహత్నూర్​ దగ్గర జరిగిన రియల్​ స్టోరీ...!

author img

By

Published : Dec 18, 2019, 11:59 PM IST

HIGHWAY ROBBERY AT ADILABAD GUDI HATNUR... ZERO FIR REGISTERED FOR THE FIRST TIME
HIGHWAY ROBBERY AT ADILABAD GUDI HATNUR... ZERO FIR REGISTERED FOR THE FIRST TIME

ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల పోలీస్ స్టేషన్ స్టేషన్​లో జీరో ఎఫ్ఐఆర్ కేసు నమోదైంది. కరణ్​సింగ్​, విశాల్​ పటేల్ అనే వ్యక్తులు నాగ్​పూర్ నుంచి హైదరాబాద్​కు కారులో వెళ్తున్నారు. వీరి కారును 3 కార్లలో దుండగులు... ఆదిలాబాద్ సమీపంలోని జాతీయ రహదారి దగ్గర వెంబడించి అడ్డగించారు. ఇద్దరిపై దాడి చేశారు. వారిని అపహరించి గుడిహత్నూర్ మండలం రాగాపూర్ వద్దకు తీసుకెళ్ళి వదిలేసి పారిపోయారు. మరో కారులో ఉన్న నలుగురు దుండగులు... బాధితుల కారుని మహారాష్ట్రకు తీసుకెళ్లి అందులోని డైమండ్ లాకర్లను తెరిచారు. కారును ధ్వంసం చేశారు. ఏమీ లభించకపోవటం వల్ల కారును వదిలేసి వెళ్లిపోయారు. బాధితులు గుడిహత్నూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా... జీరో ఎఫ్​ఐఆర్​ నమోదు చేశారు.

మొట్టమొదటి సారిగా జీరో ఎఫ్​ఐఆర్​...

ఎస్పీ ఆదేశాల మేరకు 3 బృందాలుగా ఏర్పడిన పోలీసులు దర్యాప్తు చేశారు. సాంకేతికత సహాయంతో మహారాష్ట్రలోని యవత్మాల్ జిల్లా వారాకోటలో నిలిపిన కారును గుర్తించారు. అందులో డైమండ్ల లాకర్ ఏర్పాటు చేసినట్లుగా... వాటిని దుండగులు ధ్వంసం చేసి తెరిచినట్లుగా పేర్కొన్నారు. బాధితులు గుజరాత్ నుంచి బొంబాయి, నాగపూర్ మీదుగా హైదరాబాద్​కు డైమండ్స్​ కోసం వెళుతున్నారు. కారులో డైమండ్స్​ ఉన్నట్టు ఊహించిన దుండగులు వెంబడించి చోరికి యత్నించారని పోలీసులు వివరించారు. జిల్లాలో మొదటి సారిగా జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశామని... గుడిహత్నూర్ నుంచి మావల పోలీస్​స్టేషన్​కు కేసు బదిలీ చేసినట్లు తెలిపారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు చెప్పారు.

కారులో డైమండ్స్​ ఉన్నాయని 3 కార్లతో చేజింగ్​...

ఇదీ చూడండి: 'నిర్భయ' దోషులకు ఉరి ఆలస్యం- జనవరి 7న నిర్ణయం!

Intro:tg_adb_91_18_hairobarry_avb_ts10031

Body:ఏ లక్ష్మణ్ ఇచ్చోడ జిల్లా ఆదిలాబాద్ 9490917560
....

హైవే రాబరి
*జీరో ఎఫ్ఐఆర్ కేసు నమోదు
వివరాలు వెల్లడించిన ఆదిలాబాద్, ఉట్నూర్ డిఎస్పిలు వెంకటేశ్వర రావు డేవిడ్
....
( ):- ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల పోలీస్ స్టేషన్ స్టేషన్ లో జీరో ఎఫ్ఐఆర్ కేసునమోదు నమోదు జరిగింది నాగపూర్ నుంచి హైదరాబాద్కు వెళుతున్న కారును మరో మూడు కార్లు ఆదిలాబాద్ సమీపంలోని జాతీయ రహదారి దగ్గర వెంబడించి అడ్డగించి బ్రీజా కారులో ఉన్న ఇద్దరిపై దాడి చేసి వారిని అపహరించి గుడిహత్నూర్ మండలం రాగాపూర్ వద్దకు తీసుకెళ్ళి వదిలేసి పారిపోయారు ఆ తర్వాత మరో కారులో ఉన్న నలుగురు దుండగులు మహారాష్ట్రకు తీసుకెళ్లి అందులోని డైమండ్ లాకర్లను తెరిచారు కారును ధ్వంసం చేశారు ఏమి లభించకపోవడంతో వదిలేసి పారిపోయారు బాధితులు కరణ్ సింగ్ విశాల్ పటేల్ గుడిహత్నూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఎస్పీ ఆదేశాల మేరకు ఆదిలాబాద్ డి ఎస్ పి వెంకటేశ్వరరావు ఉట్నూరు డిఎస్పి డేవిడ్ ఇచ్చోడ సిఐ శ్రీనివాస్ , ఆదిలాబాద్ గ్రామీణ సి ఐ పురుషోత్తమా చారి సిసిఎస్ సిఐ చంద్రమౌళి గుడిహట్నూర్ ఎస్సై రోహిణి మూడు బృందాలుగా ఏర్పడి దర్యాప్తును ముమ్మరం చేశారు సాంకేతిక సహాయంతో మహారాష్ట్రంలోని యవత్మాల్ జిల్లా వారాకోట గ్రామంలో నిలిపిన బ్రేజా కారు ను గుర్తించారు. అందులో డైమండ్ల లాకర్ ఏర్పాటు చేసినట్లుగా వాటిని దుండగులు ధ్వంసం చేసి తెరిచినట్లుగా పేర్కొన్నారు గుజరాత్ నుంచి బొంబాయి నాగపూర్ మీదుగా హైదరాబాద్కు డైమండ్ల కోసము వెళుతుండగా అందులో డైమండ్ లు ఉన్నట్టు ఊహించి దుండగులు వెంబడించి చోరికి యత్నించారని పోలీసులు పేర్కొన్నారు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశమని గుడిహత్నూర్ నుంచి మావల పోలీస్ స్టేషన్ కు కేసును బదిలీ చేసినట్లు పేర్కొన్నారు, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని డిఎస్పీ లు పేర్కొన్నారు.

Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.