ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం నర్సాపూర్‌లో ఏటా చేపట్టే సామూహిక వివాహల మేళా నిర్వహించారు గ్రామస్థులు. అక్కడి పాఠశాల ఆవరణలో తొమ్మిది జంటలకు సంప్రదాయబద్ధంగా వివాహాలు జరిపించారు. నర్సాపూర్ తలమద్రితో పాటు మహారాష్ట్ర నుంచి వధూవరులు ఇక్కడకు వచ్చారు. 45 పెళ్లిళ్లు ఒకేసారి చేసిన ఘనత వీరికి ఉంది. వివిధ గ్రామాల నుంచి వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేస్తారు. ఈ కార్యక్రమంలో వధూవరులను ఆశీర్వదించడానికి తెరాస అభ్యర్థి జి.నగేష్, భాజపా అభ్యర్థి సోయం బాబూరావు, కాంగ్రెస్ అభ్యర్థి రమేశ్ రాఠోడ్ హాజరయ్యారు.
సామూహిక వివాహాలతో ఆదర్శంగా నిలుస్తున్న గ్రామస్థులు - every year
పేద, ధనిక తేడా లేకుండా అన్ని వర్గాలను కలుపుతూ... కేవలం పెళ్లి ఖర్చులు మాత్రమే తీసుకొని సామూహిక వివాహాలు ఘనంగా జరిపిస్తారు ఆ గ్రామస్థులు.