ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కాముని దహనాన్ని సంప్రదాయ పూజల మధ్య ఘనంగా నిర్వహించారు. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రసిద్ధ గోపాలకృష్ణ మఠంలో కట్టెలు, ఆవుపేడతో ప్రత్యేకంగా తయారుచేసిన పిడకలు పేర్చి.. కాముని దహనం చేశారు.
డప్పు, బాజాల చప్పుళ్ల మధ్య మహిళలు సంప్రదాయ పూజలు చేశారు. అనంతరం మహిళలు, పిల్లలు పరస్పరం ఆనందోత్సహాలతో శుభాకాంక్షలు తెలుపుకుంటూ.. రంగులు చల్లుకున్నారు. జిల్లాలో నేడు హోలీ పండగను జరుపుకోనున్నారు.