ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి అర్జీదారులు పోటెత్తారు. ప్రజావాణి విభాగంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి బాధితుల నుంచి వారి ఫిర్యాదులు స్వీకరించారు. సమస్యలపై వచ్చిన అర్జీలను పరిష్కరిస్తామని ఆమె బాధితులకు భరోసా ఇచ్చారు.
మధ్యాహ్నం తర్వాత కలెక్టర్, ఇతర అధికారులు పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లగా... అధికారులు లేక ఖాలీ కుర్చీలు దర్శనమిచ్చాయి.
ఇవీ చూడండి: భార్య, పిల్లలకు విషమిచ్చి.. భర్త ఆత్మహత్య