ఆదిలాబాద్ జిల్లా రిమ్స్(RIMS) ఆస్పత్రిలో మౌలిక వసతలు లేవని పేర్కొంటూ... గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ (Governor tamilisi soundarajan)కు మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ (Ex mlc ramulu naik) లేఖ రాశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) ఆదిలాబాద్ వెళ్లినప్పటికీ... ఎలాంటి ప్రయోజనం ఉండదని ఆయన ఆరోపించారు. ప్రతి నియోజకవర్గానికి 100 పడకల ఆస్పత్రి ఏర్పాటు చేయనున్నట్లు సీఎం కేసీఆర్ (CM KCR) హామీ ఇచ్చారన్నారు.
యాభైవేల పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారని… ఇప్పటి వరకు చేయలేదని ఆరోపించారు. ఆదిలాబాద్ జిల్లాల్లో గిరిజనలకు వైద్య సౌకర్యం సక్రమంగా లేదని విమర్శించారు. ఆదిలాబాద్ రిమ్స్ (RIMS)లో కరోనాతో ప్రజలు పిట్టలు రాలినట్లు రాలిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గవర్నర్… రిమ్స్ (RIMS) ఆస్పత్రిని సందర్శించి అక్కడ ఉన్న పరిస్థితులను తెలుసుకుని గిరిజనులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.