ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని భీంపూర్ గ్రామానికి చెందిన పశువుల కాపరి సిడం మారు మంగళవారం పశువులను మేపేందుకు అడవికి వెళ్లి తప్పిపోయాడు. వెతకగా ఆచూకీ లభించలేదు. ఎట్టకేలకు శనివారం మధ్యాహ్నం పెంబి అటవీ ప్రాంతంలోని ధూందరి సమీపంలో కనిపించడంతో గ్రామస్థులు ఇంటికి తీసుకొచ్చారు. కుటుంబ పెద్ద ఇంటికి రావడం పట్ల కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. గత ఐదు రోజులుగా అడవిలో తప్పిపోయి తీవ్ర ఇబ్బందులు పడుతూ ఆహారానికి నోచుకోకుండా ఇబ్బందులు పడ్డట్లు బాధితుడు పేర్కొన్నారు.
ఇదీ చూడండి : సొంత ఉద్యోగిపై దాడి చేసిన ఎమ్మెల్యే