ETV Bharat / state

'నీట్​లో ప్రతిభ కనబరిచినందుకు ఎంపీ ఆర్థిక సాయం' - నీట్​లో ప్రతిభ కనబరిచినందుకు ఆదిలాబాద్​ ఎంపీ ఆర్థిక సాయం

నీట్​లో ప్రతిభ కనబరిచి ఆయా విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం పొందిన ఆదివాసీ విద్యార్థులకు ఆదిలాబాద్​ ఎంపీ సోయం బాపురావు ఆర్థిక సాయం అందజేశారు. ఖర్చుల నిమిత్తం ఒక్కొక్కరికి రూ. 20 వేల చొప్పున మొత్తం 9 మందికి ఇచ్చారు.

financial assistance by mp for showing talent in neat
'నీట్​లో ప్రతిభ కనబరిచినందుకు ఎంపీ ఆర్థిక సాయం'
author img

By

Published : Dec 23, 2020, 5:19 PM IST

ఆదివాసీ విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు.. వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు తనవంతు సాయం చేస్తానని తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు, ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపురావు పేర్కొన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌కు చెందిన తొమ్మిది మంది ఆదివాసీ విద్యార్థులు నీట్‌లో ప్రతిభ కనపర్చి ఆయా విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం పొందారు. వారికి ఖర్చుల నిమిత్తం ఎంపీ ఒక్కొక్కరికి రూ. 20వేల చొప్పున మొత్తం లక్షా 80వేల రూపాయలు అందజేశారు.

ఆదివాసీ ఉద్యమంలో భాగంగా విద్యార్థులు చదువుపై దృష్టిసారించారని.. ఫలితంగా ప్రముఖ విద్యాసంస్థల్లో కష్టపడి ప్రవేశం పొందగలిగారని ఎంపీ పేర్కొన్నారు. ఆదివాసీ ఉద్యోగులు, మేధావులు తమ జాతి పిల్లలకు సాయం చేసేందుకు ముందుకురావాలని కోరారు. అదేవిధంగా సాయం పొందిన విద్యార్థులు ఉన్నతవిద్యలో రాణించి జాతి అభ్యున్నతికి పాటుపడాలని ఆకాంక్షించారు.

ఇదీ చదవండి: మావోయిస్టు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యం: డీజీపీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.