మహారాష్ట్ర సరిహద్దుల్లోని ఆదిలాబాద్ జిల్లా గ్రామాల్లో కరోనా నియంత్రణకు పటిష్ఠ చర్యలు చేపడుతున్నారు. ఆ రాష్ట్రంలో కొవిడ్ ఉద్ధృతి అధికంగా ఉండడం వల్ల... రాకపోకలకు వీలు లేకుండా భీంపూర్ మండలం అంతర్గావ్ గ్రామస్థులు తమ ఊరి చుట్టూ కంచె ఏర్పాటు చేశారు.
పెన్‌గంగ నదిలో నీళ్లు లేకపోవడంతో ఈ దారి నుంచి తరలివస్తున్నారు. అందుకే ఆయా మార్గాలను మూసివేయాలని గ్రామస్థులు నిర్ణయించారు. ఇదంతా కరోనా బారిన పడకుండా ఉండేందుకు మాత్రమేనని గ్రామస్థులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: సామాజిక రోగనిరోధక శక్తితో కరోనాకు అడ్డుకట్ట!