అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట సీపీఎం ధర్నా నిర్వహించింది. ఎకరానికి రూ. 50వేల పరిహారం ఇవ్వాలని నినాదాలు చేశారు. వర్షాలకు తోడు తెగుళ్లు పంటదిగుబడులపై తీవ్ర ప్రభావం చూపాయని పార్టీ జిల్లా కార్యదర్శి డి. మల్లేశ్ వాపోయారు.
వచ్చిన పంటను కొనుగోలు చేయడంలో సీసీఐ దూది పింజ పొడవు తగ్గిందంటూ క్వింటాకు 50 రూపాయలు తగ్గించడం అన్యాయమన్నారు. కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలతో వ్యాపారులు మార్కెట్ రావడం మాని రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుని దోచుకుంటున్నారని ఆరోపించారు. వెంటనే రైతులని ఆదుకునేలా రుణమాఫీ, రైతుబీమా, రైతుబంధు నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: బియ్యం రాయితీకి నిధులు విడుదల చేసిన ప్రభుత్వం