ETV Bharat / state

Farmer Family Protest at Both: 'మా భూమి మాకివ్వండి... లేదంటే చావే దిక్కు' - Farmer Family Protest for land at both

Farmer Family Protest at Both: ఏళ్లుగా సాగుచేసుకుంటున్న భూమి వేరే వాళ్లు తమ పేరు మీద పట్టా చేసుకున్నారు. ఈ విషయం తహసీల్దార్ కార్యాలయంలో ఎన్ని సార్లు మొరపెట్టుకున్నా ప్రయోజనం లేకపోయింది. విసిగిపోయిన ఆ రైతు కుటుంబం చివరికి ఏం చేసిందంటే...

Farmer Family Protest at Both
Farmer Family Protest at Both
author img

By

Published : Dec 14, 2021, 4:39 PM IST

'మా భూమి మాకివ్వండి... లేదంటే చావే దిక్కు'

Farmer Family Protest at Both: తాతల నాటి నుంచి సాగులో ఉన్న భూమి తమకు తెలియకుండా పట్టా చేసుకున్నారని ఓ రైతు కుటుంబం తహసీల్దార్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగింది. తమ భూమి తమకు దక్కకపోతే ఇక్కడే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని భీష్మించుకుర్చున్నారు. చివరికి మహిళ రైతు నుంచి మందు డబ్బాను లాకున్నారు. ఈ ఘటన మంగళవారం బోథ్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో చోటు చేసుకుంది..

ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం కౌఠబి గ్రామానికి చెందిన చట్ల నర్సింగ్... 60 ఏళ్ల క్రితం సర్వే నెం 23లో 15 ఎకరాల భూమిని నర్సింగ్ కొనుగోలు చేశాడు. ఆ భూమిని నర్సింగ్ కొడుకు నారాయణ, తాత పేరే పెట్టుకున్న మనుమడు నర్సింగ్ ఇప్పటికి ఆ భూమిలోనే సాగు చేస్తున్నారు. నవంబర్ 8న సంబంధిత రైతు కుటుంబానికి తెలియకుండా బోథ్‌కు చెందిన ఓ వ్యక్తి తన పేరుమీద పట్టా చేసుకున్నాడని నర్సింగ్ ఆరోపించారు. భూమి తమదేనంటూ కొన్ని రోజులుగా సదురు వ్యక్తి వేధింపులకు గురిచేసినట్లు వాపోయారు. బాధిత రైతు కుటుంబం... రెవిన్యూ అధికారులకు పలుమార్లు చెప్పిన పట్టించుకోలేదని ఆవేదన వెలిబుచ్చారు.

మంగళవారం నర్సింగ్, ఆయన భార్య లక్ష్మితో పాటు నర్సింగ్ అక్క గంగుబాయి తహసీల్దార్ కార్యాలయానికి పురుగుల మందు డబ్బాతో వచ్చారు. తమకు న్యాయం చేయకపోతే ఇక్కడే మందు తాగి ఆత్మహత్యకు పాల్పడతామని హెచ్చరించారు. రెవెన్యూ అధికారులు లంచం తీసుకుని అక్రమంగా తమ భూమిని పట్టా చేసి ఇచ్చారని ఆరోపిస్తున్నారు. బాధిత కుటుంబ సభ్యుల నుంచి పోలీసులు పురుగుల మందు డబ్బాను లాక్కున్నారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.