ETV Bharat / state

ఉట్నూర్​లో నకిలీ పత్తి విత్తనాల పట్టివేత

రైతులకు అమ్మేందుకు ఆదిలాబాద్​ జైనూర్​ నుంచి కారులో తరలిస్తున్న నకిలీ పత్తి విత్తనాలను ఉట్నూర్​ పోలీసులు పట్టుకున్నారు. వాహనాన్ని సీజ్​ చేసి.. వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రూ. 70 వేల విలువైన నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై సుబ్బారావు తెలిపారు.

fake seeds caught  by police at utnoor
ఉట్నూర్​లో నకిలీ పత్తి విత్తనాల పట్టివేత
author img

By

Published : Jun 22, 2020, 8:53 AM IST

ఆదిలాబాద్​ జిల్లా ఉట్నూర్​ మండల కేంద్రంలో రైతులకు అమ్మేందుకు తరలిస్తున్న నకిలీ విత్తనాలను పోలీసులు పట్టుకున్నారు. జైనూర్​ నుంచి తన సొంత కారులో నకిలీ పత్తి విత్తనాలను మదర్​ఖాన్​ తరలిస్తుండగా పోలీసులకు అనుమానం వచ్చింది. ఉట్నూర్​ మండల కేంద్రం ఎన్టీఆర్​ చౌరస్తా వద్ద వాహనాన్ని తనిఖీలు చేశారు.

అందులో రూ.70 వేల విలువైన నకిలీ పత్తి విత్తనాలను గుర్తించారు. అక్రమంగా నకిలీ విత్తనాలను సరఫరా చేస్తున్న వ్యక్తిని వెంటనే పోలీస్​స్టేషన్​కు తరలించి దర్యాప్తు చేస్తున్నారు. నకిలీ విత్తనాలను విక్రయించిన వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు ఉట్నూర్​ ఎస్సై సుబ్బారావు తెలిపారు.

ఇదీ చూడండి:చైనాను ఆర్థికంగా దెబ్బతీసేలా కేంద్రం పావులు!

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.