ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో తొలిసారిగా యువ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుని ఆనందం వ్యక్తం చేశారు. 18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ భారత ప్రభుత్వం కల్పించిన ఓటు హక్కును ఉపయోగించుకుని సమర్థవంతమైన నాయకుడిని ఎన్నుకోవాలని తొలిసారిగా ఓటు వేసిన యువ ఓటర్లు తెలిపారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగవద్దని ఓటర్లకు యువత విజ్ఞప్తి చేశారు.
ఇవీ చూడండి: ముగిసిన తుది విడత పరిషత్ పోలింగ్