ETV Bharat / state

మండుటెండలో మృతదేహం.. మానవత్వం లేని అధికారులు! - ఆదిలాబాద్​ వార్తలు

లారీ నడుపుతూ మార్గమధ్యంలో చనిపోయిన ఓ లారీడ్రైవర్​ మృతదేహం ఆరుగంటల పాటు ఎండలోనే ఉన్నా.. అధికారులు స్పందించలేదు. తోటి డ్రైవర్​ వైద్యాధికారులకు, రెవిన్యూ అధికారులకు సమాచారం ఇచ్చినా.. సాయంత్రం దాకా పట్టించుకోలేదు.

Driver Die In Lorry Officers Overlooked In Adilabad District
మండుటెండలో మృతదేహం.. మానవత్వం లేని అధికారులు!
author img

By

Published : May 28, 2020, 3:57 PM IST

డ్రైవింగ్​ చేస్తూ.. మార్గమధ్యంలోనే ఓ లారీ డ్రైవర్​ మరణిస్తే.. అధికారులకు సమాచారం ఇచ్చినా.. సాయంత్రం వరకు స్పందించని అమానవీయ ఘటన ఆదిలాబాద్​ జిల్లాలో చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్​ నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం గంగులవారి చెరువుపల్లెకు చెందిన డ్రైవర్​ సుబ్రహ్మణ్యం మే నెల 23న ఏపీ 39 టీబీ 3019 నెంబరు గల లారీలో సహచరుడు మల్లారెడ్డి వెంకట్​రెడ్డితో కలిసి స్టీల్​ లోడు కోసం మహారాష్ట్రలోని నాగ్​పూర్​ వెళ్లాడు. లోడుతో తిరిగి కేరళకు బయల్దేరాడు. మార్గమధ్యంలో ఆదిలాబాద్​ జిల్లా జైనథ్​ మండలం పిప్పల్​వాడ టోల్​ప్లాజా వద్ద ఉదయం ఆరు గంటలకు టీ కోసం లారీ ఆపారు. అందరూ టీ తాగుతున్నా.. వారిలో సుబ్రహ్మణ్యం లేకపోవడం సహచరులు గమనించారు.

సుబ్రహ్మణ్మంతో వచ్చిన మల్లారెడ్డి వెంకట్​రెడ్డి వెళ్లి చూడగా.. సుబ్రహ్మణ్మం స్పృహ లేకుండా పడి ఉన్నాడు. వెంటనే 104కు సమాచారం అందించాడు. ఉదయం ఫోన్​ చేస్తే.. 104 అధికారులు సాయంత్రం వరకు స్పందించలేదు. రెవిన్యూ అదికారులకు సమాచారం ఇచ్చినా వారు కూడా స్పందించలేదు. సాయంత్రం వచ్చిన వైద్య సిబ్బంది సుబ్రహ్మణ్మంను పరీక్షించగా.. మూడు రోజులుగా దగ్గు, జ్వరంతో బాధపడినట్లు వెంకట్​రెడ్డి 104 సిబ్బందికి తెలిపాడు. ఎన్నిసార్లు ఫోన్​ చేసినా.. స్పందించని వైద్య సిబ్బంది.. ఈటీవిలో కథనం వచ్చిన తర్వాత స్పందించారు. అప్పటి వరకు ఎర్రటి ఎండలో సుబ్రహ్మణ్యం మృతదేహం అలాగే ఉంది.

ఇదీ చూడండి: మండుతున్న ఎండలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.