ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్‌లో నాగోబా జాతర జనసందడిగా మారింది. ఐదు రోజుల నుంచి సాగుతున్న జాతరకు రాష్ట్రంతో పాటు ఛత్తీసగఢ్, మహారాష్ట్ర నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
ఆలయ ప్రాంగణంలో నేడు దర్బార్ కార్యక్రమం జరగనుంది. కార్యక్రమానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. గతంలో ఇచ్చిన హామీలు నేటికీ నెరవేరలేదని ఆదివాసీ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి: 'నిర్భయ' కేసులో మరో దోషి క్యురేటివ్ పిటిషన్