ETV Bharat / state

రుయ్యాడి పంచాయతీకి దీన్​దయాళ్ సశక్తి కరణ్ పురస్కారం - తెలంగాణ వార్తలు

తలమడుగు మండలంలోని రుయ్యాడి పంచాయతీకి దీన్​దయాళ్ సశక్తి కరణ్ పురస్కారం లభించింది. 2019-2020 సంవత్సరానికి గానూ... పారిశుద్ధ్య విభాగంలో రుయ్యాడి పంచాయతీ ఈ పురస్కారాన్ని దక్కించుకుంది.

Dean Dayal Sashakti Karan Award for Ruyyadi Panchayat in adilabad district
రుయ్యాడి పంచాయతీకి దీన్​దయాళ్ సశక్తి కరణ్ పురస్కారం
author img

By

Published : Apr 1, 2021, 12:43 PM IST

ఆదిలాబాద్​ జిల్లా తలమడుగు మండలం రుయ్యాడి పంచాయతీ అరుదైన అవార్డును దక్కించుకుంది. కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా ఇచ్చే దీన్​దయాళ్ సశక్తి కరణ్ పురస్కారానికి రుయ్యాడి పంచాయతీ ఎన్నికైంది. రాష్ట్రం నుంచి ఎనిమిది పంచాయతీలు ఎన్నికైనట్లు అధికారులు తెలిపారు.

ఉత్తమ సేవలతో పాటు స్థానిక సంస్థలలో పారదర్శకత, పథకాల సద్వినియోగం, పారిశుద్ధ్య నిర్వహణ వంటి పనులు నిర్వహించే పంచాయతీలకు కేంద్రం ప్రతి ఏటా దీన్ దయాళ్ సశక్తి కరణ్ పేరిట పురస్కారాలు అందజేస్తోంది. దీనిలో భాగంగా 2019-20 సంవత్సరానికి గాను... పారిశుద్ధ్య విభాగంలో రుయ్యాడికి పురస్కారం దక్కింది. ఈ పురస్కారం దక్కడం పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: ఆత్మహత్యలకు చిరునామాగా మారుతున్న రైల్వేట్రాక్​లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.