ETV Bharat / state

CS Respond: ఈటీవీ భారత్ కథనాలపై సీఎస్ స్పందన.. విద్యార్థులకు దుప్పట్లు పంపాలని ఆదేశం

CS Respond on Gurukulam Students: రాష్ట్రంలో చలి రోజురోజుకు పెరిగిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో గిరిజన ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాలలో ఉన్న విద్యార్థులకు కనీస సౌకర్యాలు సమకూర్చడంలో ప్రభుత్వం విఫలమైంది. ఈ నేపథ్యంలో ప్రచురించిన వార్తలపై సీఎస్ సోమేశ్ కుమార్ స్పందించారు. వెంటనే ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లాలకు 34 వేల దుప్పట్లను పంపించాలని ఆదేశించారు.

CS Respond on Gurukulam Students
సీఎస్ సోమేశ్ కుమార్
author img

By

Published : Dec 23, 2021, 9:26 AM IST

CS Respond on Gurukulam Students: ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాలకు ప్రభుత్వం 34వేల దుప్పట్లు పంపించింది. చలితీవ్రత పెరిగిన నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో గిరిజన విద్యార్థులు పడుతున్న ఇబ్బందులపై ఈనాడు, ఈటీవీ భారత్​లో వచ్చిన కథనాలపై స్పందించింది. గిరిజన ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల్లో విద్యార్థులకు దుప్పట్లు, స్వెటర్లు, మంకీక్యాప్‌లు కొనుగోలు చేసేందుకు గిరిజన సంక్షేమశాఖ మంత్రి ఆర్డరును ఆమోదించారు. ప్రభుత్వం వెంటనే 34వేల దుప్పట్లను ఆదిలాబాద్‌, కుమురం భీం ఆసిఫాబాద్‌, నిర్మల్‌, మంచిర్యాల జిల్లాలకు పంపించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఆదేశించారు. ఇప్పటికే దుప్పట్లను ఆయా జిల్లాలకు రవాణా చేసిన గిరిజన సంక్షేమశాఖ బుధవారం రాత్రికే విద్యార్థులందరికీ పంపిణీ చేయాలని జిల్లా సంక్షేమ అధికారులను ఆదేశించింది.

గిరిజన సంక్షేమశాఖ పరిధిలో రూ.ఏడు కోట్లతో దాదాపు 2 లక్షల మంది విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేసేందుకు గత ఏడాది ఆ శాఖ అంచనాలు రూపొందించింది. కరోనా కారణంగా పాఠశాలలు మూతపడటం, వసతి గృహాలు తెరవకపోవడంతో కొనుగోలు చేయలేకపోయింది. ఈ ఏడాది పాఠశాలలు ప్రారంభమై మూడు నెలలు గడుస్తున్నా నిధులు మంజూరు కాలేదు. రెండు రోజుల క్రితం ఆర్థిక శాఖ గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో కొనుగోలుకు టెండర్లు ఆహ్వానించాలని సంక్షేమశాఖ నిర్ణయించింది. మరో 15 రోజుల్లో విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేస్తామని చెబుతోంది.

సీనియర్లకు సర్దుబాటు

ఎస్సీ, బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలోని వసతి గృహాలు, సంక్షేమ గురుకులాల పరిస్థితి ఇంకా అలాగే ఉంది. గత ఏడాదికి సేకరించిన దుప్పట్లను ప్రస్తుతం ఉంటున్న విద్యార్థులకు పంపిణీ చేస్తున్నారు. వసతి గృహాల్లో పూర్తిస్థాయిలో విద్యార్థులు వసతి పొందితే.. కొత్తగా వచ్చేవారికి పంపిణీకి సరిపడా దుప్పట్లు లేవు. గురుకులాల్లో సర్దుబాటు ప్రక్రియ కొనసాగుతోంది. బీసీ, మైనార్టీ సంక్షేమ గురుకులాల్లో పాఠశాలలు జూనియర్‌ కళాశాలలుగా ఉన్నతీకరించడంతో వసతికి సరైన భవనాలు లేవు. దీంతో 5, 6, 7 తరగతులకు ప్రత్యక్ష బోధన నిలిపివేశారు. ఆ విద్యార్థులకు సంబంధించిన దుప్పట్లను సీనియర్‌ విద్యార్థులకు సర్దుబాటు చేస్తున్నారు. ఈ విద్యాలయాల్లోనూ కొనుగోలుకు అవసరమైన నిధులు ఇంకా మంజూరు కాలేదు.

ఇదీ చూడండి: Students Suffering: చలితో అల్లాడుతున్న విద్యార్థులు.. పట్టించుకోని అధికారులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.