ETV Bharat / state

సాగు లెక్కతేలుస్తున్న వ్యవసాయ అధికారులు

author img

By

Published : Jul 18, 2020, 6:44 AM IST

జిల్లాల వారీగా రైతులు సాగు చేస్తున్న పంటల వివరాల సేకరణలో వ్యవసాయ అధికారులు నిమగ్నమయ్యారు. నియంత్రిత సాగు విధానంలో భాగంగా రైతు యూనిట్‌గా పంటల సాగు, విత్తన రకాలు, చరవాణి నంబరు తదితర పూర్తి వివరాలను సేకరించి అంతర్జాలంలో నమోదు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సాగు విస్తీర్ణం, దిగుబడులు, తదితర వాటిని పరిగణనలోకి తీసుకొని కొనుగోలు కేంద్రాలు గిట్టుబాటు ధరలు తదితర వాటిని నిర్ణయించనున్నారు.

సాగు లెక్కతేలుస్తున్న వ్యవసాయ అధికారులు
crop detail collection in telangana to implement controlled cultivation method

ఇప్పటి వరకు విత్తనాల అమ్మకాలు, తదితర వాటి ఆధారంగా సాగు విస్తీర్ణాన్ని అంచనా వేసేవారు. దీనివల్ల క్రయవిక్రయాల సమయంలో ఇబ్బందులు ఏర్పడేవి. తాజాగా ప్రభుత్వం రైతుల వారీగా సాగు విస్తీర్ణం అంతర్జాలంలో నమోదు చేయాలని ఆదేశించడంతో సాగుకు సంబంధించిన లెక్కలు తేల్చేపనిలో వ్యవసాయ సిబ్బంది తలమునకలయ్యారు. పంట సాగు నమోదు ఆధారంగానే భవిష్యత్‌ కార్యాచరణ రూపొందించే అవకాశం ఉంది.

అంతర్జాలంలో వివరాల నమోదు..

ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లాలో పంటల సాగు, వ్యవసాయ స్థితిగతులపై సర్వే నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. భూప్రక్షాళన చేసి, రైతులకు కొత్త పట్టా పాసుపుస్తకాలు ఇచ్చినా.. రెవెన్యూ, వ్యవసాయ, ముఖ్య ప్రణాళికాధికారి శాఖల మధ్య ఉన్న సాగు భూములు, దిగుబడులు, పంటల సాగు తదితర వివరాల్లో భారీ తేడాలుంటున్నాయి. గత సర్వేలతో సంబంధం లేకుండా ఈ వానాకాలంలో రైతుల వారీగా పంటల సాగుకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరించి అంతర్జాలంలో నమోదు చేస్తున్నారు.

నమోదు చేసుకుంటేనే కొనుగోళ్లు..

జిల్లాల వారీగా చేపట్టనున్న సర్వేతో ఉమ్మడి ఆదిలాబాద్‌లో సాగు లెక్క పక్కాగా తేలనుంది. రైతుల వారీగా సర్వే నంబర్‌, సాగు విస్తీర్ణంతో పాటు, వేసిన పంట, విత్తన రకం, ప్రధాన పంట, అంతర పంటలు, నీటి వసతి, చరవాణి నంబర్‌, చివరలో రైతు సంతకం తీసుకోనున్నారు. పంట సాగు చేసే ప్రతి రైతు తమ వివరాలు నమోదు చేసుకుంటేనే ప్రభుత్వ కేంద్రాల్లో పంటను అమ్ముకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఈ ప్రక్రియ కొనసాగుతున్నా.. వివరాల లెక్క తేలకపోవడంతో గత సీజన్‌లో ఆన్‌లైన్‌లో పేర్లు లేకున్నా అమ్మకాలకు అవకాశం ఇచ్చారు. తాజాగా ఆన్‌లైన్‌లో పేర్లు, సాగు చేసిన పంట తదితర వివరాలు ఉంటేనే ప్రభుత్వ కేంద్రాల్లో మద్దతు ధరతో అమ్ముకునేందుకు అవకాశం ఉంటుందని వ్యవసాయ అధికారులు అంటున్నారు.

రైతు చరవాణికి సమాచారం

రైతుల వారీగా సేకరించిన పంట సాగు వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేసిన తరువాత రైతుల నుంచి సేకరించిన చరవాణి నంబర్‌కు సంక్షిప్త సమాచారం పంపిస్తారు. రైతు వారీగా ఎన్ని ఎకరాలు ఉంటే, వాటిలో ఏయే పంటలు సాగు చేశారనే సమాచారం రైతుల చరవాణికి సందేశం రూపంలో పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామాల వారీగా రైతు పేరు, పట్టా పాసుపుస్తకం నంబర్‌, సర్వే నంబర్‌, తదితర వివరాలు ఇప్పటికే ఆన్‌లైన్‌ ముద్రించి ఉన్నాయి. వాటిని వ్యవసాయ విస్తరణ అధికారులు కంప్యూటర్‌ నుంచి ప్రింట్‌ తీసుకొని, రైతు వారీగా సాగు చేసే పంటల వివరాలు, విత్తన రకాలు, నీటి వసతి, యంత్రపరికరాలు, పశువులు, తదితర వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది.

నమోదు చేసుకోవాలి

పంటల సాగుకు సంబంధించిన సమాచారం తీసుకునేందుకు మా సిబ్బంది గ్రామాలకు వస్తారు. ఆ సమయంలో వారికి అందుబాటులో ఉండి సర్వే నంబర్ల వారీగా ఎన్ని ఎకరాల్లో ఏయే పంటలు సాగు చేశారో నమోదు చేసుకోవాలి. జాబితాల్లో పేర్లు ఉంటే పంట అమ్మకాల్లో ఇబ్బందులు ఉండవు.

- వెంకటి, ఆదిలాబాద్ జిల్లా వ్యవసాయాధికారి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.