ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల పరిధిలో ఇప్పటివరకు కరోనా పాజిటివ్ బాధితుల సంఖ్య 2,747కి చేరుకుంది. ఇందులో యాక్టివ్ కేసుల సంఖ్య 1,527. మొత్తం 34 మంది మృత్యువాత పడ్డారు.
మంచిర్యాల జిల్లాలో వ్యాధితోపాటు మృతుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. కరోనా మృతుల సంఖ్య 18కి చేరగా, ఆదిలాబాద్ జిల్లాలో తొమ్మిది, నిర్మల్ జిల్లాలో ఆరుగురు, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఒక్కరి చొప్పున మృతిచెందారు.
మంచిర్యాల జిల్లాలో కరోనా బాధితులు 620, ఆదిలాబాద్ జిల్లాలో 404, నిర్మల్ జిల్లాలో 402, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 96 మంది ఉన్నారు. రోజురోజుకు బాధితుల సంఖ్య పెరుగుతండటం వల్ల ప్రజల్లో భయాందోళన నెలకొంది.
ఇదీ చూడండి : 'దళారులు, నాయకులను నమ్మకుండా పనిచేయాలి'