ఆదిలాబాద్ జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీలో పత్తి కొనుగోళ్లు మొదలయ్యాయి. జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎమ్మెల్యే జోగురామన్న ముహూర్తపు కొనుగోళ్లను ప్రారంభించారు. జడ్పీ ఛైర్మన్ రాఠోడ్ జనార్దన్, మార్కెట్ కమిటీ ఛైర్మన్ ప్రహ్లాద్ పాల్గొన్నారు.
తొలిరోజు కావడంతో మార్కెట్‌కి పత్తి వాహనాలు భారీగా తరలివచ్చాయి. సీసీఐ ద్వారా పత్తి కొనుగోళ్లు చేపట్టారు. తేమ శాతం 8 నుంచి 12 శాతం మేర నమోదైన పత్తిని కొనుగోలు చేస్తామని మార్కెట్ యజమాన్యం ప్రకటించింది.
ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటుచేశారు. రైతులకు మద్దతు ధర లభించేలా తమవంతు సహకారం అందిస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఇదీ చదవండి: దీక్షిత్‌రెడ్డిని కిడ్నాప్ చేసి అన్నారం గుట్టవరకు ఎలా తీసుకెళ్లారు?