ఆదిలాబాద్ జిల్లా వ్యవసాయ మార్కెట్ యార్డులో బుధవారం నుంచి పత్తి కొనుగోలు ప్రారంభిస్తున్నట్లు జిల్లా పాలనాధికారి దివ్య దేవరాజన్ వెల్లడించారు. ప్రత్యేకంగా పత్తి వాహనాలను తెప్పించి తొలుత యార్డులో ఆ తర్వాత జిన్నింగ్ మిల్లులో ప్రయోగాత్మకంగా తేమశాతం నమోదును పరిశీలించారు. రైతులు పత్తి ఆరబెట్టుకుని తీసుకొస్తే మంచి ధర లభిస్తుందని సూచించారు. మండలాల వారీగా పత్తి కొనుగోళ్లు చేపడుతున్నట్లు వెల్లడించారు. జాయింట్ కలెక్టర్ సంధ్యారాణి, మార్కెటింగ్ డీడీ అజ్మీరారాజు, ఆర్డీవో సూర్య నారాయణ, మార్కెట్ కమిటీ ఛైర్మన్ ప్రహ్లాద్ అధికారులు కలెక్టర్ వెంట ఉన్నారు.
ఇవీ చూడండి: అశ్రునయనాల మధ్య విజయారెడ్డి అంతిమయాత్ర