ETV Bharat / state

పత్తి రైతులకు ఆధార్‌ కష్టాలు - యజమాని వస్తే గానీ జరగని విక్రయాలు - పత్తి రైతుల సమస్య

Cotton farmers Problems with Aadhaar Authentication : ఆదిలాబాద్‌ జిల్లా వ్యాప్తంగా పత్తి సాగు చేస్తున్న రైతన్నలను కొత్త కష్టాలు వెంటాడుతున్నాయి. సాగు అనంతరం వచ్చిన దిగుబడులను మార్కెట్‌ యార్డులో విక్రయించేందుకు నానా కష్టాలు పడుతున్నారు. ఆధార్‌ సహిత నగదు చెల్లింపుల విధానంతో అన్నదాతలకు ఇబ్బందులు తప్పడం లేదు.

Cotton farmers Problems with Aadhaar Authentication
Cotton farmers Problems in Adilabad
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 7, 2024, 6:15 PM IST

పత్తి రైతులకు ఆధార్‌ కష్టాలు

Cotton farmers Problems with Aadhaar Authentication : ఆదిలాబాద్‌ జిల్లాలో పత్తి సాగు అధికం. ఈ పంటపై ఆధారపడి బతుకుతున్న రైతులెందరో ఉన్నారు. ప్రభుత్వం మద్దతు ధర క్వింటాకు రూ.7,020 ఉంది. ప్రైవేటు వ్యాపారులు ధర తక్కువగా పలుకుతుండటంతో రైతులంతా ప్రభుత్వ రంగ సంస్థ సీసీఐకి విక్రయిస్తున్నారు. ఈ సంవత్సరం నుంచి సీసీఐ ఆధార్‌ అథంటికేషన్‌(CCI Aadhaar Authentication) విధానం అమలు చేస్తోంది.

Cotton Farmers Problems Telangana 2024 : సీసీఐ విధానంలో విక్రయదారుకు సంబంధం లేకుండా పట్టా ఎవరి పేరు మీద ఉందో వారే వచ్చి తొలుత వేలి ముద్ర వేసి ధ్రువీకరించుకోవాల్సి ఉంటుంది. ఇదే రైతన్నలకు పెద్ద సమస్యగా మారింది. ఇంతవరకు మార్కెట్‌ యార్డు ముఖం చూడని మహిళలు విక్రయానికి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. వారంతా పత్తి వాహనం తూకం మొదలుకొని, తిరిగి ఖాళీ వాహనం తూకం అయ్యే వరకు గంటల తరబడి వేచి చూస్తూ ఇబ్బందులు పడుతున్నారు.

Cotton Farmers Problems Telangana 2023 : ప్రతికూల వాతావరణం.. పత్తి రైతులకు శాపం

"మార్కెట్‌లో పత్తి విక్రయించాలంటే యజమాని వేలిముద్ర తప్పనిసరిగా ఉండాలన్నారు. మా అమ్మ నడవకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకు వచ్చాం. ఇక్కడ గంటల కొద్దీ వేచి ఉండాల్సిన పరిస్థితి వస్తోంది. డబ్బులు కూడా జీరో ఖాతాలో వేస్తున్నారు. అవి కొంత మందికి క్లోజ్‌ అయిపోయాయి. ఆధార్ అథంటికేషన్ ద్వారా చాలా ఇబ్బంది పడుతున్నాం."- పత్తి రైతు, ఆదిలాబాద్

Cotton Farmers Problems with Aadhaar : జిల్లాలో ఇప్పటివరకు 58వేల రైతులు 10లక్షల క్వింటాళ్ల పత్తిని విక్రయించగా అందులో సగానికిపైగా సీసీఐకే అమ్మారు. ఆధార్‌తో కూడిన చెల్లింపులతో రైతులకు ఏ ఖాతాలో డబ్బు జమ అవుతుందో తెలియలేదు. పరిమితి తక్కువగా ఉన్న పోస్టాఫీసు ఖాతాల్లో, పంటరుణ ఖాతాల్లో, మూసివేసిన ఖాతాల్లో డబ్బులు పడుతున్నాయని అన్నదాతలు వాపోతున్నారు. తిరిగి ఆ డబ్బులు పొందేందుకు ఇప్పుడు ఉన్న ఖాతాను సమర్పించాలని అధికారులు సూచించడంతో చెల్లింపులు రోజులు, నెలల తరబడి ఆలస్యమవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆధార్‌కు చరవాణి నెంబరును(Mobile Number Link Aadhaar), లావాదేవీలు నడిచే బ్యాంకు ఖాతాకు ఆధార్‌ సంఖ్యను అనుసంధానం చేసుకుంటే రైతులకు ఇబ్బందులు ఉండవని అధికారులు సూచిస్తున్నారు.

ఆ మార్కెట్‌లో.. కమీషన్‌దారులు.. ఆడిందే ఆట పాడిందే పాట

"ఈ సంవత్సరం నుంచి కేంద్ర ప్రభుత్వం ఆధార్ ఆధారిత విక్రయం మొదలు పెట్టింది. ఇందులో భాగంగానే తమ ఆధార్‌ను తమ బ్యాంక్ ఖాతాకు లింక్‌ చేసుకోవాలని కోరుతున్నాం. ఆధార్ లింక్‌ అయిన వాటిలో డబ్బులు జమ చేస్తున్నాం. ఆధార్‌కు మొబైల్ లింక్ చేసుకుని వస్తే మార్కెట్ యార్డ్‌లో గంటల కొద్దీ ఉండాల్సిన పని ఉండదు. ఈ విషయం ఇప్పటికే చాలాసార్లు చెప్పాం."- శ్రీనివాస్‌, జిల్లా మార్కెటింగ్‌ అధికారి, ఆదిలాబాద్‌

cotton farmers: దళారుల దగా... విత్తన పత్తి రైతులు విలవిల

పెట్టుబడైనా వస్తుందనుకుంటే అదీ లేదు.. మరి రైతుల పరిస్థితేంటి..?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.