ETV Bharat / state

జిల్లాలో కొత్తగా 25 కరోనా కేసులు.. ఒకరు మృతి - corona cases in adilabad

ఆదిలాబాద్ జిల్లాలో కొవిడ్​ బారినపడి మరొకరు మరణించారు. జిల్లాలో ఇప్పటివరకు మరణాల సంఖ్య ఆరుకు చేరింది. తాజాగా నమోదైన 25 కేసులతో కలిసి ప్రస్తుతం కేసుల సంఖ్య 315కు చేరింది. వీరిలో చికిత్స పొంది 131 మందికి ఇంటికి చేరుకున్నారు.

one dead in dilabad due to corona
జిల్లాలో కొత్తగా 25 కరోనా కేసులు.. ఒకరు మృతి
author img

By

Published : Aug 8, 2020, 7:22 AM IST

ఆదిలాబాద్ జిల్లాలో రోజురోజుకీ కరోనా తీవ్రంగా విజృంభిస్తోంది. కరోనా బారినపడి రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పట్టణవాసి మృతిచెందగా.. ఇప్పటివరకు మరణాల సంఖ్య ఆరుకు చేరుకుంది. జిల్లాలో తాజాగా నమోదైన 25 కేసులతో కలిపి ప్రస్తుతం క్రియాశీలక కేసుల సంఖ్య 315కు చేరింది.

ఆదిలాబాద్​లో ఇప్పటివరకు 3,526 మందికి కొవిడ్ పరీక్షలు చేయగా.. 452 మందికి పాజిటివ్ వచ్చింది. అందులో 131 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 15 మంది చికిత్స పొందుతుండగా.. ముగ్గురు హైదరాబాద్​లోని ప్రైవేటు ఆసుపత్రుల్లో, ఒకరు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు జిల్లా వైద్యాధికారి నరేందర్ వెల్లడించారు. మిగిలిన 297 మంది హోంఐసోలేషన్​లో ఉన్నారని ఆయన తెలిపారు. పట్టణాలకే పరిమితమైన కరోనా.. ఇప్పుడు పల్లెలకు పాకుతుండటం వల్ల ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.