తెలంగాణ సరిహద్దు జిల్లాల్లో కరోనా కట్టడికి అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. మహారాష్ట్ర సరిహద్దు జిల్లా అయిన ఆదిలాబాద్లో కరోనా కట్టడికి అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా మహారాష్ట్ర నుంచి వచ్చే ప్రయాణికులపై ప్రత్యేక దృష్టి సారించారు. అటు వైపు నుంచి వచ్చే బస్సుల్లో క్లోరినేషన్ చేస్తూ వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
అధికారుల ఆదేశాల ప్రకారం ప్రయాణ ప్రాంగణాల్లో శానిటైజర్లు అందుబాటులో ఉంచారు. ఫ్లెక్సీలు, కరపత్రాల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. బస్సు ఎక్కాలంటే శానిటైజర్ల ద్వారా చేతులు శుభ్రం చేసుకున్న తర్వాతనే అనుమతిస్తున్నారు.
ప్రత్యేక క్యాంపు ఏర్పాటు
రైల్వే స్టేషన్ వద్ద ప్రత్యేక క్యాంపును ఏర్పాటు చేశారు. ప్రయాణికుల్లో ఎవరికైనా వ్యాధి లక్షణాలు ఉన్నాయా? అని పరిశీలిస్తున్నారు. మహారాష్ట్రలో కరోనా కేసులు అధికంగా నమోదవుతున్న నేపథ్యంలో అక్కడి వారు ఇటు వచ్చే అవకాశమున్నందున అవసరమైన చర్యలు తీసుకుంటునట్లు అధికారులు చెబుతున్నారు.
- ఇదీ చూడండి : కరోనా కలవరం: భారత్లో 169కి చేరిన కేసులు