ETV Bharat / state

'చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్​ ఫాంహౌస్​పై సీబీఐతో దాడి చేయించండి'

చిత్తశుద్ధి ఉంటే సీఎం కేసీఆర్​ ఫాంహౌస్​పై సీబీఐతో దాడి చేయించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్‌కి కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్​ రెడ్డి సవాల్‌ విసిరారు. వారిద్దరూ మళ్లీ అధికారంలోకి వస్తే దేశం, రాష్ట్రం నాశనమవుతుందని విమర్శించారు. ప్రాణహిత జలాలు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాకు తరలించాలని ఉద్యమం చేస్తానని జీవన్​రెడ్డి స్పష్టం చేశారు.

jeevan reddy
jeevan reddy
author img

By

Published : Dec 21, 2020, 5:11 PM IST

రాష్ట్రంలో విమర్శించుకుని, దిల్లీలో ఆలింగనాలు చేసుకునే భాజపా, తెరాసలు తోడు దొంగలని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రైతులకు బకాయిపడ్డ బీమా పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ ఆదిలాబాద్‌ కలెక్టరేట్‌ ఎదుట కాంగ్రెస్​ నిర్వహించిన ధర్నాకు ఆయన హాజరయ్యారు.

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాకు దక్కాల్సిన ప్రాణహిత జలాలను అక్రమంగా సిద్దిపేటకు తరలిస్తున్నారు. ప్రాణహిత జలాలు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాకు తరలించాలని ఉద్యమం చేస్తాం. రైతులకు రావాల్సిన బీమా పరిహారం కోసం శాసనమండలి సమావేశాల్లో ప్రస్తావించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తా.

- జీవన్​ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ

ధర్నా అనంతరం పీసీసీ ప్రధానకార్యదర్శి గండ్రత్‌ సుజాత, మాజీమంత్రి చిరుకూరి రాంచంద్రారెడ్డి, జిల్లా ఇంఛార్జీ అధ్యక్షుడు సాజిద్‌ఖాన్‌తో కలిసి ఆర్డీవో రాజేశ్వర్‌రావుకు జీవన్​రెడ్డి వినతిపత్రం అందజేశారు.

'చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్​ ఫాంహౌస్​పై సీబీఐతో దాడి చేయించండి'

ఇదీ చదవండి : మత కల్లోలాలు సృష్టించేందుకు భాజపా కుట్ర: ఇంద్రకరణ్ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.