ETV Bharat / state

రహదారుల దుస్థితిపై కాంగ్రెస్​ నాయకుల వినూత్న నిరసన - dilapidation of roads

రహదారుల దుస్థితిపై ఆదిలాబాద్​ పట్టణంలో కాంగ్రెస్​ నాయకులు ఆందోళన చేపట్టారు. రోడ్డు మీద గుంతలలో వరి నారు నాటి వినూత్నంగా నిరసన తెలిపారు. ప్రభుత్వం స్పందించి రోడ్లను బాగుచేయాలని కోరారు.

congress leaders protested over the dilapidation of roads in adilabad
రహదారుల దుస్థితిపై కాంగ్రెస్​ నాయకుల వినూత్న నిరసన
author img

By

Published : Aug 18, 2020, 4:32 PM IST

ఆదిలాబాద్ పట్టణంలోని రోడ్ల దుస్థితిపై కాంగ్రెస్​ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. రోడ్డు మీద ఉన్న గుంతలలో వరి నారు నాటి వినూత్న నిరసన తెలిపారు. ఎమ్మెల్యే, మున్సిపల్ ఛైర్మన్​కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పట్టణంలో నడిబొడ్డున ఉన్న నేతాజీ చౌక్​లోని పెద్ద గుంతలు ఏర్పడినా.. వాటిని మరమ్మతులు చేపట్టడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని కాంగ్రెస్​ జిల్లా మైనారిటీ ఛైర్మన్​ సాజిద్​ దుయ్యబట్టారు.

నిత్యం అధికారులు, రాజకీయ నాయకులు తిరిగే రహదారి పరిస్థితి ఇలా ఉంటే.. ఇక కాలనీల్లో పరిస్థితి ఏవిధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పట్టణంలోని రోడ్లను బాగు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కలీం, మోసిన్, మడావి రాజు, నాగేష్, జిలాని, కరీం, రాహుల్, తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి: కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని కలెక్టర్​కు వినతిపత్రం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.